టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక మందన హవా సాగుతోంది. గ్లామర్, క్యూట్ లుక్స్ తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ని ఫిదా చేసిన రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ బడా హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. రష్మిక చివరగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం రష్మిక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ చిత్రంలో నటిస్తోంది. మరి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో రష్మికని అవకాశాలు వరిస్తున్నాయి. ఇదిలా ఉండగా రష్మిక ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో మెరిసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

స్టైలిష్ డ్రెస్ లో రష్మిక విమానాశ్రయంలో కనిపించింది. కానీ నార్మల్ గా కాదు.. రష్మిక విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకుంది. దీనితో విమానం కోసం ఉరుకులు పరుగుల మీద రష్మిక కనిపించింది.  సమయంలో కొందరు రష్మిక ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. వారితో ఫన్నీ కామెంట్స్ చేస్తూ రష్మిక వెళ్ళింది. నేను అసలే ఆలస్యంగా వచ్చాను.. మీరేమో ఫోటోలు తీస్తున్నారు అని కామెంట్స్ చేస్తూ నవ్వుకుంటూ విమానం కోసం పరిగెత్తింది. 

విమానం కోసం పరిగెత్తుతూ కూడా రష్మిక క్యూట్ గా కనిపిస్తోంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  రష్మిక టాలీవుడ్ లోకి ఛలో చిత్రంతో అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్న రష్మిక ఆ తర్వాత గీత గోవిందం చిత్రంతో క్రేజీ నటిగా మారిపోయింది.