సంక్రాంతి బరిలో కొదమ సింహాల్లాంటి రెండు తెలుగు చిత్రాలు పోటీ పడుతున్నాయి. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం శనివారం రోజు ప్రేక్షకుల ముందుకు రాగా.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మూవీ ఆదివారం రోజు విడుదలవుతోంది. రెండు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 

ఈ నేపథ్యంలో రెండు చిత్రాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సమంత ట్వీట్ చేసింది. 'టాలీవుడ్ సినిమాకు గోల్డెన్ డేస్ కొనసాగుతున్నాయి. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో టాలీవుడ్ 2020ని ఘనంగా ప్రారంభించింది. ఈ రెండు చిత్రాల నటీనటులకు, సాంకేంతిక నిపుణులకు కంగ్రాట్స్.. సంక్రాంతి బ్లాక్ బస్టర్స్' అని సమంత ట్వీట్ చేసింది. 

'అల.. వైకుంఠపురములో' ట్విట్టర్ రివ్యూ.. ఆ ఎపిసోడ్స్ అదిరిపోయాయి!

ఇక హీరో మంచు మనోజ్ 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంపై ట్వీట్ చేశాడు. 'మహేష్ అన్న చెప్పినట్లుగానే బొమ్మ దద్దరిల్లిపోయింది. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సాధించినందుకు కంగ్రాట్స్' అని మనోజ్ ట్వీట్ చేశాడు. 

త్రివిక్రమ్ కెరీర్ లో బెస్ట్ మూవీ.. మాట నిలబెట్టుకున్న బన్నీ!

సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో చిత్రం తెరకెక్కింది. రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో బాక్సాఫీస్ కలెక్షన్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.