Asianet News TeluguAsianet News Telugu

మత మార్పిడులే కారణమా.. విజయ్ ఐటీ రైడ్స్ పై విజయ్ సేతుపతి స్ట్రాంగ్ రిప్లై

ఇళయదళపతి విజయ్ పై ఐటీ అధికారులు దాడులు జరపడం తమిళనాడులో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. విజయ్ పై జరిగిన ఐటీ దాడుల వ్యవహారం పొలిటికల్ హీట్ ని కూడా పెంచుతోంది. కొన్ని రోజుల క్రితం విజయ్ మాస్టర్ చిత్ర షూటింగ్ లో ఉండగా ఐటి అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. 

Vijay Sethupathi blasts trolls for conspiracy theories around IT raids
Author
Hyderabad, First Published Feb 12, 2020, 3:58 PM IST

ఇళయదళపతి విజయ్ పై ఐటీ అధికారులు దాడులు జరపడం తమిళనాడులో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. విజయ్ పై జరిగిన ఐటీ దాడుల వ్యవహారం పొలిటికల్ హీట్ ని కూడా పెంచుతోంది. కొన్ని రోజుల క్రితం విజయ్ మాస్టర్ చిత్ర షూటింగ్ లో ఉండగా ఐటి అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. 

విజయ్ ని కొన్ని గంటలపాటు ప్రశ్నించారు. విజయ్ నివాసంతో పాటు, బిగిల్ చిత్ర ఫైనాన్సియర్ అన్బు చెళియన్ నివాసంలో కూడా పెద్ద ఎత్తున అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో విజయ్, అన్బు చెళియన్ నివాసం నుంచి అధికారులు దాదాపు 70 కోట్ల నల్ల ధనాన్ని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మెర్సల్ చిత్రంలో విజయ్ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన డైలాగ్స్ వల్లే ప్రస్తుతం కక్ష్య సాధింపు జరుగుతోందని విజయ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. 

విజయ్ ఫ్యాన్స్, బిజెపి కార్యకర్తల మధ్య పెద్ద వారే జరుగుతోంది. ఐటీ దాడులు జరిగిన అనంతరం బిజెపి కార్యకర్తలు విజయ మాస్టర్ చిత్ర షూటింగ్ ని అడ్డుకోవాలని ప్రయత్నించడం, విజయ్ అభిమానులు ప్రతిఘటించడం జరిగింది. 

బ్యాగుల్లో కూడా పట్టనంత డబ్బు.. విజయ్, బిగిల్ ఫైనాన్సియర్ ఇంట్లో..

ఇదిలా ఉండగా హీరో విజయ్ పై ఐటీ దాడులు జరగడానికి అసలు కారణం ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని కీపాయింట్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో విజయ్ సేతుపతి, ఆర్య, రమేష్ ఖన్నా లాంటి సినీ ప్రముఖుల్ని కూడా బ్లేమ్ చేస్తున్నారు. హీరో విజయ్ వద్ద నల్లధనం, మత మార్పిడులే ఐటి దాడులకు ప్రధాన కారణం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై విజయ్ సేతుపతి ట్విట్టర్ వేదికగా ఘాటుగా బదులిచ్చాడు. వైరల్ అవుతున్న ఓ పోస్ట్ ని ట్వీట్ చేసి.. వెళ్లి మీ పని చూసుకోండి అని బదులిచ్చాడు. 

ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే.. 'ప్రముఖ రాజకీయ నాయకుడు జెప్పియార్ కుమార్తె రెజీనా తమిళనాడులో క్రిస్టియానిటీ ఎక్కువవుతుండడానికి కారణం. ఇటీవలే ఆమె ద్వారా విజయ్ సేతుపతి, ఆర్య, రమేష్ ఖన్నా లాంటి సినీ ప్రముఖులు క్రిస్టియానిటీకి మారారు. చిత్ర పరిశ్రమలో మరింతగా మతమార్పిడులు జరగాలని రెజీనా వాళ్ళని ఆదేశించిందట. దీని కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుచేసేందుకు సిద్ధం అయ్యారు. 

సీఎం జగన్, పీకేలతో విజయ్.. కలకలం రేపుతోన్న పోస్టర్లు!

ఈ వ్యవహారం మొత్తన్ని మోడీ, అమిత్ షా గమనిస్తూ వచ్చారు. విజయ్ బిగిల్ చిత్రానికి ఫైనాన్సియర్ అన్బు చెళియన్. కానీ తెరవెనుక ఉండింది మాత్రం రెజీనా. సినిమా విడుదలయ్యాక ఆ డబ్బుని విజయ్, అన్బు చెళియన్ రెజీనా ఇంటికి తరలించడానికి ప్రయత్నిచారు. ఈ క్రమంలోనే ఐటి దాడులు జరిగాయి. ఇంకా తెరవెనుక జరిగిన నిజాలన్నీ బయటకు రాబోతున్నాయి' అని ఆ పోస్ట్ లో ఉంది. 

ఈ అసత్య ఆరోపణలని ఖండిస్తూ విజయ్ సేతుపతి ట్వీట్ చేశాడు.    

Follow Us:
Download App:
  • android
  • ios