భవిష్యత్తులో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగే లక్షణాలు సారా అలీ ఖాన్ కు ఉన్నాయంటూ ఇప్పటి నుంచే అంచానాలు మొదలయ్యాయి. తొలి చిత్రం నుంచే సారా అలీ ఖాన్ తన వాక్ చాతుర్యం, చలాకీ తనంతో ఆకట్టుకుంటోంది. ఇక ఆమె గ్లామర్ కు కూడా యువత ఫిదా అవుతున్నారు.సైఫ్ అలీ ఖాన్ వారసురాలిగా సారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.  

కెరీర్ ఆరంభమలోనే సారా అలీ ఖాన్ గ్లామర్ షో మొదలుపెట్టేసింది. తాజాగా సారా అలీ ఖాన్ నటించిన చిత్రం లవ్ ఆజ్ కల్. ఈ చిత్రంలో యువ హీరో కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ జంటగా నటించారు. ఆ మధ్యన విడుదలైన ట్రైలర్ బి టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ ఇద్దరూ లిప్ లాక్ సీన్స్, బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోవడమే అందుకు కారణం.

ఈ చిత్రం వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేస్తోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కు వెళ్లగా.. పలు సన్నివేశాలపై సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని సన్నివేశాలని తొలగించారు. మరికొన్నింటికి బ్లర్ చేశారు. 

మత మార్పిడులే కారణమా.. విజయ్ ఐటీ రైడ్స్ పై విజయ్ సేతుపతి స్ట్రాంగ్ రిప్లై

సారా అలీఖాన్, కార్తీక్ ఆర్యన్ మధ్య వచ్చే కొన్ని అసభ్యకరమైన డైలాగ్స్ ని మ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలని మార్చాలని కూడా సెన్సార్ బోర్డు చిత్ర యూనిట్ ని ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెండితెరపై బోల్డ్ కంటెంట్ హవా నడుస్తోంది. దీనితో సారా అలీఖాన్ గ్లామర్, బోల్డ్ పెర్ఫామెన్స్ తో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోవాలని చేసిన ప్రయత్నాలకు సెన్సార్ బోర్డు కొంత వరకు అడ్డుకట్ట వేసింది. ఇక హీరో కార్తీక్ ఆర్యన్ కూడా కెరీర్ ఆరంభం నుంచి ఇలాంటి రొమాంటిక్ చిత్రాలతోనే పాపులర్ అయ్యాడు. 

ఇంతియాజ్ అలీ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.