సల్మాన్ ఖాన్ నటిస్తున్న దబంగ్ సిరీస్ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ సిరీస్ లో ఇప్పటికే వచ్చిన దబంగ్, దబంగ్ 2 చిత్రాలు ప్రేక్షకులని అలరించాయి. చుల్ బుల్ పాండేగా సల్మాన్ ఖాన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దబంగ్ సిరీస్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కారణంగా దక్షణాది భాషల్లో కూడానా దబంగ్ 3 ని రిలీజ్ చేస్తున్నారు. 

సల్మాన్ ఖాన్ కు జోడిగా ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. ప్రభుదేవా దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సల్మాన్ ఖాన్ ఇండియా మొత్తం తిరుగుతూ దబంగ్ 3కి ప్రచారం కల్పిస్తున్నాడు. బుధవారం రోజు హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ హాల్ లో దబంగ్ 3 ప్రీరిలీజ్ వేడుక జరిగింది. 

సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా, కిచ్చా సుదీప్, ప్రభుదేవా తో పాటు ఇతర దబంగ్ 3 చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కు విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ అతిథులుగా హాజరయ్యారు. 

స్టన్నింగ్.. ఈషా రెబ్బ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.. ఫొటోస్!

సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. రాంచరణ్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసు అని, చిరంజీవిగారితో ఎన్నో ఏళ్ల సాన్నిహిత్యం ఉందని తెలిపారు. రాంచరణ్ తనకు చిన్న తమ్ముడు లాంటివాడని సల్లూభాయ్ తెలిపాడు. ఇక వెంకటేష్ ని వెంకీమామ అని సంభోదించాడు. వెంకటేష్ తో తనకు 25 ఏళ్ల నుంచి స్నేహం ఉందని పేర్కొన్నాడు. 

దబంగ్ 3 ప్రీరిలీజ్.. సల్లూ భాయ్ తో రాంచరణ్, వెంకటేష్ సందడి.. ఫొటోస్!

రాంచరణ్, వెంకటేష్ కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రసంగించి దబంగ్ 3 చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. సల్మాన్ ఖాన్ తో కలసి వెంకీ, చరణ్ డాన్స్ కూడా చేయడం విశేషం. 

టైమ్ బాంబ్ ఆన్ అయింది.. పవన్ కళ్యాణ్ పై సాయిధరమ్ తేజ్ కామెంట్స్