కెరీర్ మంచి జోరుమీద ఉన్న టైంలో డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులు సాయిధరమ్ తేజ్ ని వెనక్కు లాగాయి. రోజురోజుకు సాయిధరమ్ తేజ్ మార్కెట్ క్షీణిస్తున్న టైంలో చిత్రలహరి లాటి మంచి విజయం దక్కింది. గత ఏడాది విడుదలైన ప్రతి రోజూ పండగే చిత్రం సూపర్ హిట్ గా నిలవడంతో సాయిధరమ్ తేజ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. 

ప్రస్తుతం తేజు రెట్టించిన ఉత్సాహంతో తదుపరి చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర థీమ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా సాయిధరమ్ తేజ్ ఓ ఆసక్తికర చిత్రానికి ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఎన్టీఆర్ విలన్ హీరోగా 'అంతరిక్షం' డైరెక్టర్ మూవీ!

దూసుకెళ్తా, రగడ ఫేమ్ వీరు పోట్ల దర్శత్వంలో ఓ  పీరియాడిక్ చిత్రంలో సాయిధరమ్ తేజ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ దేవరాయ టైం పీరియడ్ లో తెరకెక్కే ఈ చిత్రానికి 40 కోట్ల బడ్జెట్ ఖర్చు కానుందట. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

పవన్ కళ్యాణ్ Vs ప్రకాష్ రాజ్.. క్లైమాక్స్ లో హైలైట్స్ ఇవే!

ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. ఇదే కనుక నిజమైతే సాయిధరమ్ తేజ్ పెద్ద రిస్క్ చేస్తున్నట్లే. వరుస ఫ్లాపుల నుంచి బయట పడి తేజు ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాడు. అలాంటి తరుణంలో పీరియాడిక్ చిత్రం, 40 కోట్ల బడ్జెట్ రిస్క్ లు ఎందుకనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కథని నమ్మి తేజు ఈ డెసిషన్ తీసుకుంటాన్నాడేమో వేచి చూడాలి.