పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేసవిలో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ కు మాస్ లో ఫాలోయింగ్ ఎక్కువ. దీనితో పింక్ రీమేక్ చిత్రానికి ప్రకటన వచ్చినప్పుడు పవన్ ఫ్యాన్స్ కొంత నిరాశ వ్యక్తం చేశారు. పవర్ ఫుల్ మూవీతో రీ ఎంట్రీ ఉందనుకుంటే.. ఫైట్స్ , పాటలు లేని చిత్రంతో వస్తున్నాడేంటి అని అనుకున్నారు. 

కానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలని దృష్టిలో ఉంచుకునే దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఈ చిత్రాన్ని నేరుగా ఉన్నది ఉన్నట్లుగా రీమేక్ చేయడం లేదు. పవన్ నటిస్తున్న ఈ చిత్రంలో మూడు సాంగ్స్, ఫైట్స్ కూడా ఉండబోతున్నాయి. ఇది పవన్ అభిమానులకు సంతోషాన్ని కలిగించే అంశమే. 

పూరి దర్శకత్వంలో పవర్ స్టార్.. 400 కోట్ల టార్గెట్ ?

ఇక దర్శకుడు శ్రీరామ్ వేణు పింక్ చిత్రంలోని సోల్ మిస్ కాకుండా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ పై శ్రీరామ్ వేణు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థిగా లాయర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఈ చిత్రం ఎక్కువ భాగం కోర్టులో ఉంటుంది కాబట్టి పవన్, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. 

ఒక్క ఛాన్స్ కోసం వితికా తిప్పలు.. ఫోటోలపై ఫోకస్!

ప్రస్తుతం క్లైమాక్స్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్ లో నల్ల కోటు ధరించిన లుక్ కూడా ఒకటి లీక్ అయింది. క్లైమాక్స్ లో పవన్ డైలాగ్స్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. త్వరలో పింక్ రీమేక్ సాంగ్స్ రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. నివేత థామస్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మే లో రిలీజ్ చేయనున్నారు.