ఘాజి, అంతరిక్షం ఫేమ్ సంకల్ప్ రెడ్డి ప్రతిభగల దర్శకుడు అని చెప్పడం లో సందేహం అవసరం లేదు. సంకల్ప్ తెరకెక్కించిన రెండు చిత్రాలు ప్రయోగాలే. అండర్ వాటర్ మిషన్ గా తెరకెక్కిన ఘాజి సూపర్ హిట్ గా నిలిచింది. స్పేస్ సైన్స్ నేపథ్యంలో తెరకెక్కిన అంతరిక్షం చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కానీ సంకల్ప్ రెడ్డికి ప్రశంసలు దక్కాయి. 

సంకల్ప్ రెడ్డి చిత్రాలకు వైడర్ మార్కెట్ ఉన్న బాలీవుడ్ లాంటి వేదికలు సరైనవి అని గతంలో కామెంట్స్ వినిపించాయి. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి ఆ దిశగానే ప్రయత్నాలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంకల్ప్ రెడ్డి తదుపరి చిత్రం బాలీవుడ్ లో తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

బాలీవుడ్ నటుడు, సౌత్ లో పలు చిత్రాల్లో విలన్ గా నటించిన విద్యుత్ జమాల్ హీరోగా సంకల్ప్ రెడ్డి ఓ చిత్రం తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విద్యుత్ జమాల్ సౌత్ లో విజయ్ 'తుపాకీ', ఎన్టీఆర్ 'శక్తి' లాంటి చిత్రాల్లో విలన్ గా నటించాడు. హ్యాండ్సమ్ లుక్ లో కనిపించే విద్యుత్ కు మంచి క్రేజ్ ఉంది. 

పవన్ కళ్యాణ్ Vs ప్రకాష్ రాజ్.. క్లైమాక్స్ లో హైలైట్స్ ఇవే!

విద్యుత్ జమాల్ తండ్రి ఆర్మీలో అధికారిగా పనిచేస్తున్నారు. సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఘాజి చిత్రం ఆయన్ని ఇంప్రెస్ చేసిందట. దీనితో తన కొడుకుని హీరోగా పెట్టి ఓ చిత్రం తెరకెక్కించాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. దీనితో సంకల్ప్ రెడ్డి ప్రస్తుతం రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఓ యాక్షన్ చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.