ఏళ్ల తరబడి ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో కొన్ని రోజులుగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జబర్దస్త్ నుంచి మెగా బ్రదర్ నాగబాబు తప్పుకున్న సంగతి తెలిసిందే. యాజమాన్యంతో విభేదాల వల్ల నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి నాగబాబు, రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

దీనితో జబర్దస్త్ లో నాగబాబు స్థానాన్ని భర్తీ చేసేది ఎవరనే విషయం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం రోజా మాత్రమే జడ్జిగా వ్యవహరిస్తున్నారు.తాజాగా విడుదుల చేసిన జబర్దస్త్ ప్రోమోలో ఆర్ఎక్స్ 100 ఫేమ్ హీరో కార్తికేయ మెరిశాడు. రోజా పక్కన కూర్చుని కామెడీ స్కిట్ లని ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. 

'సారీ సిస్టర్ నిన్ను కాపాడుకోలేకపోయాం..?' ప్రియాంకా హత్యపై హీరో కార్తికేయ కామెంట్స్!

ఈ ఎపిసోడ్ గురువారం రోజు ప్రసారం కానుంది. ఈ షోలో కార్తికేయ హాజరు కావడానికి కారణం ఉంది. డిసెంబర్ 5న కార్తికేయ నటించిన 90 ఎంఎల్ చిత్రం విడుదల కాబోతోంది. కార్తికేయపై జోడిగా ఈ మూవీలో హీరోయిన్ నేహా సోలంకి నటిస్తోంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా కార్తికేయ జబర్దస్త్ లో మెరిశాడు. 

ప్రియాంక హత్య: ఈ జంతువులని ఇలా చేయండి.. చట్టానికి వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూచన!

జబర్దస్త్ టీం కలసి కామెడీ పంచ్ లు వేశాడు. హైపర్ ఆది, అనసూయపై వేసిన కామెడీ పంచ్ లకు కార్తికేయ పగలబడి నవ్వుతూ కనిపించాడు. అశోక్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతున్న 90ఎంఎల్ చిత్రానికి శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకుడు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం.