హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించింది. ఈ నెల 27న ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళ్లిన ప్రియాంక తిరిగి ఇంటికి రాలేదు. మధ్యలో తన సోదరికి ఫోన్ చేసి స్కూటీ పంక్చర్ అయ్యిందని తనకు భయంగా ఉందని చెప్పిన కొద్ది సేపటికే ఆమె ఫోన్స్విచ్ ఆఫ్ అయ్యింది. 

బుధవారం నాడు మిస్ అయిన ప్రియాంకారెడ్డి గురువారం తెల్లవారు జామున షాద్ నగర్ సమీపంలో శవమై తేలడంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ప్రియాంక రెడ్డిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి అతిదారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టేశారు.

రోజురోజుకి భయం పెరిగిపోతుంది.. ప్రియాంకారెడ్డి ఘటనపై కీర్తి సురేష్!

ఈ ఘటన తెలంగాణా రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రియాంకా రెడ్డిని దారుణంగా హతమార్చిన వారికి ఉరిశిక్ష అమలు చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం ప్రియాంకా హత్యపై స్పందిస్తున్నారు.నిందుతులను కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు.

ఈ క్రమంలో టాలీవుడ్ హీరో కార్తికేయ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. గుణ 369 సినిమా క్లైమాక్స్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడే తనకు నాలుగైదు రోజులు డిస్టర్బింగ్ 
గా ఉండేదని.. అలాంటిది నిజంగా అలాంటి ఘటన జరగడం, మనం దాని గురించి ఏమీ చేయలేకపోవడం సిగ్గు చేటని అన్నారు.

ప్రియాంక ఆత్మ ఎలానూ శాతించదని, అందుకే రెస్ట్ ఇన్ పీస్ సొసైటీ అనడం బెటర్ అని చెబుతూ 'సారీ సిస్టర్ నిన్ను కాపాడుకోలేకపోయాం' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. 'గుణ 369' సినిమాలో ఓ అమ్మాయిపై అఘాయిత్యం చేయాలనుకున్న వారిని హీరో దారుణంగా చంపేస్తుంటాడు. ఇప్పుడు అటువంటి ఘటనే బయట జరగడం, ప్రియాంకను కాపాడుకోలేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.