నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్. మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన సాంగ్, టీజర్, ట్రైలర్ కు అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభించింది. రిలీజ్ కు కొద్దిరోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. 

ఈ చిత్ర నిర్మాత సి కళ్యాణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రూలర్ మూవీ అభిమానులకు విందు భోజనంలా ఉంటుందని అన్నారు. ఈ స్సందర్భంగా సి కళ్యాణ్ టాలీవుడ్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

నెల్లూరు మారుమూల గ్రామం నుంచి వచ్చిన తనకు ఇంత పేరు తీసుకువచ్చింది ఇండస్ట్రీనే అని అన్నారు. చిత్ర పరిశ్రమలో కొత్త నిర్మాతలు రావాలి. కొత్త నిర్మాతలని ప్రోత్సహించకుంటే చాలా ప్రమాదం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పాత నిర్మాతలు మాత్రమే సినిమాలు తీయాల్సి వస్తే ఇండస్ట్రీ కేవలం 6 నెలల్లో మూతపడుతుంది అని సి కళ్యాణ్ అన్నారు. 

సినీ హీరోలు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీలో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. చిత్ర పరిశ్రమలోని వ్యక్తులు గ్రూపులుగా విడిపోయారు. బాలకృష్ణని కలిస్తే ఆ వర్గం మనిషి అని.. పవన్ కళ్యాణ్ ని కలిస్తే మరో వర్గం వ్యక్తి అని కొత్త ట్యాగ్స్ సృష్టిస్తున్నారు. 

మెగాస్టార్, మణిశర్మ హిట్స్ అండ్ ఫ్లాప్స్.. చిరంజీవినే రాంగ్ అని ప్రూవ్ చేశాడు!

గతంలో ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం వద్దకు అంతా కలసి వెళ్ళేవాళ్ళం. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. ఇండస్ట్రీలోని వ్యక్తులు రాజకీయ గ్రూపులుగా విడిపోవడం మంచిది కాదు. థియేటర్స్  నలుగురి చేతుల్లోనే ఉయన్నాయనడం సరికాదు. చాలా మంది థియేటర్స్ లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. అది తప్పు కాదు అని సి కళ్యాణ్ తెలిపారు. 

కాజల్ అగర్వాల్ లవ్ ఎఫైర్.. వైరల్ పిక్ తో మొదలైన రూమర్లు!

భవిష్యత్తులో కూడా బాలయ్యతో సినిమాలు చేస్తానని తెలిపారు. త్వరలో బాలయ్య, వివి వినాయక్ కాంబినేషన్ లో చిత్రానికి ప్లాన్ చేయబోతున్నట్లు సి కళ్యాణ్ వివరించారు. చాలా రోజులుగా బాలయ్య, వినాయక్ కాంబో గురించి వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే. రూలర్ మూవీ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

హీరోయిన్ బోల్డ్ ఫోటో.. మండిపడుతున్న నెటిజన్లు!