టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వన్నె తరగని అందంతో, నటనతో దశాబ్దానికి పైగా పేక్షకులని అలరిస్తోంది. కాజల్ అగర్వాల్ సౌత్ లో స్టార్ హీరోలందరి సరసన నటించింది. కాజల్ నటించిన ఎన్నో చిత్రాలు అద్భుతమైన విజయాలుగా నిలిచాయి. కాజల్ అందానికి అభిమానులు చందమామ అని కూడా పేరు పెట్టేశారు. 

టాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ గా వెలుగొందుతున్నా కాజల్ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాల ఆరబోత చేయలేదు. ఇటీవల ఎదురైన వరుస పరాజయాలతో కాజల్ అగర్వాల్ జోరు కాస్త తగ్గింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం చెక్కు చెదరలేదు. కుర్ర హీరోయిన్ల రాకతో కాజల్ రేసులో కొద్దిగా వెనకబడింది. 

ఇప్పటికే దశాబ్దానికి పైగా నటిగా కొనసాగడంతో కాజల్ మదిలో ప్రేమ, పెళ్లి ఆలోచనలు మొదలైనట్లు ఉన్నాయి. మీడియా వరుసగా కాజల్ అని పెళ్లి గురించి ప్రశ్నిస్తుండడంతో కొన్ని రోజుల క్రితం తన మనసులో మాట బయటపెట్టింది. త్వరలో వివాహం చేసుకుంటానని తెలిపింది. కానీ చిత్ర పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తినే వివాహం చేసుకుంటానని కాజల్ తెలిపింది. 

అప్పటి నుంచి కాజల్ పెళ్లిపై ఎనక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాజల్ ఎవరైనా అజ్ఞాత వ్యక్తితో ప్రేమలో ఉందా అనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో వివాహం చేసుకుంటానని, ప్రస్తుతానికి తాను సింగిల్ గానే ఉన్నానని కాజల్ క్లారిటీ ఇస్తోంది. ఇటీవల కాజల్ అగర్వాల్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ పిక్ అనేక రూమర్లకు బలాన్నిచ్చే విధంగా ఉంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#Decembervibes 💕

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on Dec 8, 2019 at 4:02am PST

చేతివేళ్ళతో లవ్ సింబల్ చూపిస్తూ ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. సెలెబ్రటీలు తమ ప్రేమ వ్యవహారాల్ని ఇలాగే నర్మగర్భంగా తెలియజేస్తారు. గతంలో అనుపమ పరమేశ్వరన్ కూడా లవ్ సింబల్ లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. దీనితో ఆమె ఓ యువ క్రికెటర్ తో ప్రేమలో ఉందని ఊహాగానాలు వినిపించాయి. 

ప్రస్తుతం కాజల్ కూడా ఎవరితోనైనా ప్రేమలో ఉండే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ పరిమిత సంఖ్యలో మాత్రమే చిత్రాలు చేస్తోంది. కమల్ హాసన్ సరసన శంకర్ దర్శత్వంలో ఇండియన్ 2 చిత్రంలో, బాలీవుడ్ లో మారో చిత్రంలో నటిస్తోంది.