సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత ప్రతీ ఒక్కరూ తమ క్రేజ్ ని పెంచుకోవాలని చూస్తున్నారు. రకరకాల ఫోటోలు షేర్ చేయడం, ఫాలోవర్స్ ని పెంచుకోవడం వంటివి చేస్తున్నారు. సామాన్య జనాలే ఇలా ఉంటే ఇక సెలబ్రిటీల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్ లలో పాల్గొనడం వాటిని అభిమానులతో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్లు, మోడల్స్ పెట్టే ఫోటోలకు డిమాండ్ బాగా పెరిగింది. కొందరు సెలబ్రిటీలు మరీ బోల్డ్ గా ఉండే ఫోటోలను షేర్ చేస్తున్నారని.. ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులు ఆ ఫోటోలను డిలీట్ చేస్తున్నారు.

మరో స్టార్ హీరోతో శంకర్ న్యూ మూవీ..!

తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటి క్రిస్సీ టీజెన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో హాట్ టాపిక్ గా మారింది. షూటింగ్ లో భాగంగా మెట్లపై కూర్చున్న క్రిస్సీ దగరకు ఆమె కూతురు వస్తుంది. ఆ సమయంలో క్రిస్సీ వక్షోజాలు కనిపించేలా డ్రెస్ వేసుకుంది. ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే కొందరు నెటిజన్ల నుండి వ్యతిరేకత ఎదురైంది.

ఇలాంటి ఫోటోలు యువతపై చెడు ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో ఓ నెటిజన్.. 'కవర్ చేస్కో.. నీ కూతురు అక్కడే ఉంది' అంటూ క్లాస్ పీకాడు. దానికి క్రిస్సీ.. 'కొన్ని నెలల పాటు నా చనుబాలు తాగింది. తనేంఅనుకోడు' అంటూ సమాధానమిచ్చింది.

ఈ విషయంలో కొందరు క్రిస్సీ సపోర్ట్ చేస్తుండగా.. ఎక్కువ మంది మాత్రం ఆమెని విమర్శిస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఫోటోని మాత్రం తొలగించలేదు.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

on set with my stylist

A post shared by chrissy teigen (@chrissyteigen) on Dec 6, 2019 at 11:13pm PST