ప్రస్తుతం చిరంజీవి తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. పరాజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 152వ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి గోవింద ఆచార్య, గోవిందా హరి గోవిందా అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ సరసన రెండవసారి త్రిష రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

దాదాపు 13 ఏళ్ల క్రితం త్రిష, చిరంజీవి స్టాలిన్ చిత్రంలో కలసి నటించారు. ప్రస్తుతం చిరు 152వ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం కొరటాల నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా సైరా చిత్రం ముందు నుంచి చిరు, రాంచరణ్ కలసి నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. 

చిరు 152 టైటిల్.. 'గోవిందా హరి గోవిందా'..?

ఈ కొరటాల చిత్రంలో రాంచరణ్ ప్రత్యేకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. దీనిపై రాంచరణ్ తాజాగా స్పందించాడు. సైరా చిత్రంలో నేను కూడా నటిస్తానని అంతా అనుకున్నారు. నా కోసం షేర్ ఖాన్ అనే అతిథి పాత్ర కూడా సిద్ధం అయింది. 

కానీ పూర్తి స్క్రిప్ట్ సిద్ధమయ్యే సరికి నా పాత్రని తొలగించారు. కానీ ఇటీవల నాన్నగారు ఓ సందర్భంలో మాట్లాడుతూ మేమిద్దరం కలసి నటిస్తాం అని అన్నారు. ఆయన అలా ఎందుకు అన్నారో నాకైతే తెలియదు. నాన్నగారు ఇటీవల నాలుగు కథలు విన్నారు. ఆ కథల్లో నన్ను ఏ చిత్రంలో ఊహించుకుంటున్నారో తెలియదు. 

మెగా ఫ్యామిలీ అమెరికా లాంటిది.. మిగిలిన వాళ్లకు ఆ అర్హత కూడా లేదు: ఆర్జీవీ!

సైరాలో నటించాల్సింది. కుదర్లేదు. త్వరలో తెరకెక్కబోయే చిరు 152 చిత్రంలో నటిస్తానని నాకైతే ఆశలు లేవు. నాన్నగారు ఎప్పుడు అనుకుంటే మా కాంబినేషన్ అప్పుడు రెడీ అవుతుంది అని రాంచరణ్ తెలిపాడు. 

చిరు 152 కూడా కొరటాల స్టైల్ లో మంచి సందేశాత్మక అంశాలతో తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో చిరంజీవి దేవాదాయ శాఖ అధికారిగా కనిపించబోతున్నారు. దేవాదాయ శాఖలో జరిగే అవినీతిని కొరటాల శివ ఈ చిత్రంలో ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు. 

Chiru 152:చిరు సినిమా కోసం గుడి.. కొరటాల వెతుకులాట!

మ్యాట్నీ ఎంటెర్టైనెంట్, కొణిదెల ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. కొరటాల శివకు ఇంతవరకు పరాజయమే లేదు. ఆయన తెరకెక్కించిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.