మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారనే విషయంలో 'గోవింద ఆచార్య' టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీని మీద కొన్ని ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా వచ్చాయి. ఇప్పుడు మరో టైటిల్ వినిపిస్తోంది. అదేంటంటే.. 'గోవిందా హరి గోవిందా'.

మహేష్ మేనల్లుడితో ఇస్మార్ట్ బ్యూటీ రొమాన్స్

ఈ సినిమా లైన్ ప్రకారం ఈ టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. టెంపుల్స్, వాటికి సంబంధించిన ప్రాపర్టీస, వాటిని దొంగిలించే ముఠా ఈ నేపధ్యంలో సినిమా సాగుతుందని సమాచారం. దానికి తగ్గట్లుగా దేవుడి టచ్ ఇచ్చి టైటిల్ గోవిందా అనే పేరుని తీసుకోస్తున్నారట. ఇందులో చిరు ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు.

అందులో ఓ పాత్ర పేరు గోవింద కాగా మరొక పాత్ర పేరు ఆచార్య. చిరు సరసన హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో మరో హీరోయిన్ కి స్కోప్ ఉండడంతో సెకండ్ హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు.  చిరు ఇమేజ్ కి తగ్గ కథా నాయికలు అంటే నయనతార, కాజల్ లాంటి వారిని తీసుకోవాలని భావిస్తున్నారు.

కానీ ఇప్పుడు తెరపైకి మరో కొత్త పేరొచ్చింది. అది ఎవరంటే.. జెనీలియా. చిరు పర్సనాలిటీ ముందు జెనీలియా పెద్దగా సెట్ కాదు. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఆమెని సంప్రదించే పనిలో ఉన్నారని సమాచారం. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!