కొద్ది రోజుల క్రితం దాకా సైరా ప్రమోషన్స్ లో ఉన్న ..మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రానికి సిద్దమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివదర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం నిమిత్తం సెట్స్ ని భారీగా వేస్తున్నారు. ప్రొడక్షన్‌ డిజైనర్‌ సురేశ్‌ సెల్వరాజన్‌ కొత్త ఇంటి సెట్ ని సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్  కోకాపేటలో ఉన్న చిరంజీవి కుటుంబానికి చెందిన ఫామ్ లాండ్ లో ఈ కొత్త సెట్స్ నిర్మాణం జరుగుతోంది.

సైరా సెట్స్ కూడా ఇంతకు ముందు అక్కడే నిర్మాణం చేసారు. వాటిని తీసేసి ఇప్పుడు ఓ కాలనీ సెట్, హీరోయిన్ ఇంటిసెట్ వేస్తున్నట్లు సమాచారం.కొరటాల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దేవాదయ భూముల రక్షణ, నక్సలిజం వంటి అంశాలతో కూడిన కథ కావటంతో సింహాచలం ను పోలిన ఓ గుడి లో షూటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు గుడి సెట్ వేయటానికి అన్ని రకాల ప్రతిపాదనలు, లెక్కలు ఆర్ట్ డైరక్టర్ తో కలిసి ప్లాన్ చేసి, చివర్లో విరమించుకున్నట్లు సమాచారం.

ఎంతో మందిని తొక్కేశారు.. నా జోలికి రావద్దు చిరంజీవి గారు.. శ్రీరెడ్డి కామెంట్స్!

అప్పట్లో గుణ శేఖర్ ...మహేష్ బాబు అర్జున్ సినిమాకు మధురై సెట్ వేసినట్లుగానే ఇప్పుడీ సింహాచలం తరహా సెట్ ని వేద్దామని ప్లాన్ చేసారు.  అయితే గుడి సెట్ అంటే చాలా ఎక్కువ అయ్యేటట్లు ఉందని, రియల్ లొకేషన్స్ తీస్తేనే బెస్ట్ అని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు కొరటాల టీమ్ అలాంటి గుడి కోసం వెతుకుతున్నారట. జనాలు పెద్దగా రాని, కొద్ది రోజులు షూటింగ్ చేసుకునేందుకు ఫర్మిషన్ దొరకటమే కాకుండా, షూటింగ్ జరిగే సమయంలో జనాల తాకిడి లేకుండా,  ఏ విధమైన ఇబ్బందులు రాని గుడి కోసం సెర్చింగ్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం అని తెలుస్తోంది. మెజారిటీ సీన్స్ ను సెట్స్‌లో తెరకెక్కిస్తారట! అలాగే, రామోజీ ఫిల్మ్‌ సిటీలో కొంత భాగం షూట్ చేయనున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. చిరంజీవి నుండి అభిమానులు ఆశించే ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్  కల కథను కొరటాల సిద్ధం చేశారట. రామ్‌చరణ్‌, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ డిసెంబర్‌లో మొదలు కానుందని సమాచారం.