మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో భారీ చిత్రం ఇది. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. 

కొన్ని నెలల క్రితం రాంచరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో గాయపడ్డాడు. దీనితో కొన్ని వారాలపాటు షూటింగ్ వాయిదా వేశారు.  చిరంజీవి సైరా చిత్ర ప్రచార కార్యక్రమాలు కూడా ఉండడంతో చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు పూర్తి స్థాయిలో అందుబాటులో లేడు. ఎట్టకేలకు చరణ్ గాయం నుంచి కోలుకోవడం, సైరా విడుదలైపోవడంతో మళ్ళీ షూటింగ్ తో బిజీ అయిపోయాడు. 

నాకైతే ఆశలు లేవు.. చిరు152పై రాంచరణ్ కామెంట్స్!

ఆర్ఆర్ఆర్ మూవీ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రతిరోజు ఉదయమే రాంచరణ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఓ వీడియో ద్వారా అభిమానులకు తెలిపాడు. ప్రస్తుతం అల్లూరి సీతా రామరాజు పాత్రలో ఉన్న చరణ్ ని బ్రిటీష్ వారి కోర్టులో హాజరు పరిచే సన్నివేశాలని రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. 

చిత్రంలో ఈ సన్నివేశాలు చాలా కీలకం కానున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి ఈ చిత్రాన్ని 1920 కాలం నాటి బ్రిటీష్ పరిస్థితుల నేపథ్యంలో రూపొందిస్తున్నారు. అల్లూరి, కొమురం భీం రెండేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళాక ఏం జరిగి ఉంటుందనే అంశాన్ని కల్పితగాధగా జక్కన్న చూపించబోతున్నాడు. 

చిరు కుమార్తె శ్రీజ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఆటపట్టించిన రాంచరణ్!

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. అలియా భట్ రాంచరణ్ కు జోడిగా నటిస్తోంది. సముద్రఖని, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 31న ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది.