మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఇంట్లో బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. రాంచరణ్ సోదరి శ్రీజ నేడు జన్మదిన వేడుకలు జరుపుకుంది. శ్రీజ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ఆమె భర్త కళ్యాణ్ దేవ్, రాంచరణ్, సుశ్మిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసే శ్రీజ బర్త్ డే ని సెలెబ్రేట్ చేశారు. 

ఈ వేడుకల్లో రాంచరణ్, శ్రీజ మధ్య చోటు చేసుకున్న సరదా ఘటన అభిమానులని ఆకట్టుకుంటోంది. శ్రీజకు కేక్ తినిపించడానికి ప్రయత్నించిన చరణ్ ఆమెని ఆటపట్టించాడు. కేక్ పూర్తిగా తినిపించకుండానే వచ్చిందా.. చాలు అంటూ ఆటపట్టించాడు. దీనితో పక్కనే ఉన్న సుస్మిత శ్రీజని చూసి నవ్వుకుంది. 

రాంచరణ్ ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు లక్షల్లో లైకులు లభిస్తున్నాయి. ఇక శ్రీజ బర్త్ డే సందర్భంగా ఆమె భర్త కళ్యాణ్ దేవ్ కూడా సోషల్ మీడియాలో స్పందించాడు. 

రాంచరణ్, శ్రీజ మధ్య జరిగిన సంఘటనపై స్పందిస్తూ.. మిమ్మల్ని అలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్ డే శ్రీజ.. నీతో కలసి ఈ వేడుకల్ని జీవితాంతం జరుపుకుంటా.. ఈ బర్త్ డే చాలా స్పెషల్ అని కళ్యాణ్ దేవ్ కామెంట్ చేశాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy birthday baby sis @sreeja_kalyan .Never bored of bugging u ❤️ #vachindaChalu

A post shared by Ram Charan (@alwaysramcharan) on Nov 9, 2019 at 8:00pm PST