దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలిని మించేలా ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రంతో తన దర్శకత్వంలో ఎలా ఉంటుందో నార్త్ ఆడియన్స్ కు రుచి చూపించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ రూపంలో మరో క్రేజీ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నాడు. 

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. షూటింగ్ ప్రారంభమైన ఆరంభంలోనే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2020 జులై 30న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 

కానీ షూటింగ్ లో జరుగుతున్న ఆలస్యం కారణంగా ఆర్ఆర్ఆర్ విడుదల దసరాకు వాయిదా పడ్డట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలని ఆర్ఆర్ఆర్ టీం కూడా ఖండించలేదు. తాజా సమాచారం మేరకు రాజమౌళి అభిమానులకు మరో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ దసరా రిలీజ్ కూడా వ్ వాయిదా పడిందట. 

దసరా కంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడమే బెటర్ అని రాజమౌళి భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కు డిజప్పాయింట్ మెంట్ తప్పదు. 

పిక్ టాక్: ఇలియానా ఇలా కనిపిస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోరూ..

నటీనటుల వివరాలు తప్ప రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అందించలేదు. మరోవైపు షూటింగ్ లో జరుగుతున్న లీకులు కూడా రాజమౌళిని కలవరపెడుతున్నాయి. ఎన్టీఆర్ పులితో ఫైట్ చేస్తున్న పిక్ ఒకటి లీకై వైరల్ గా మారింది. అంతకు ముందు షూటింగ్ లొకేషన్ లో బ్రిటిష్ కాలం నాటి పోలీస్ స్టేషన్ ఫోటోలు వైరల్ అయ్యాయి. 

రాజమౌళి సినిమాలో శ్రీయ.. ఆమె రోల్ ఇదేనా?