ఇలియానా టాలీవుడ్ లోకి సైలెంట్ గా వచ్చి ఒక సునామీలా మారిపోయింది. దేవదాసు చిత్రంతో హీరోయిన్ మారిన ఇలియానా తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా మారిపోయింది. పోకిరి చిత్రంలో ఇలియానా అందాలకు యువత ఫిదా అయ్యారు. పోకిరి తర్వాత ఇలియానాకు టాలీవుడ్ ఊపిరి సలపని విధంగా ఆఫర్స్ వచ్చాయి. 

కెరీర్ మంచి జోరు మీద ఉన్న టైంలో ఇలియానా బాలీవుడ్ కు వెళ్ళింది. ఆరంభంలో అక్కడ బాగానే ఉన్నా నెమ్మదిగా ఆమె అక్కడ ప్రాధాన్యత లేని హీరోయిన్ గా మారిపోయింది. అప్పుడప్పుడూ వచ్చే కొన్ని ఆఫర్స్ తో కాలం గడుపుతోంది. 

ఇక ఇలియానా సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడి రచ్చ ఆగడం లేదు. గ్లామర్ ఫొటోలతో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో నిలుస్తోంది. తాజాగా ఇలియానా అందాలు ఆరబోస్తున్న పిక్ ఒకటి సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

అల్లు అరవింద్ కామెంట్స్ పై సరికొత్త చర్చ.. ప్రభుత్వంపై ఒత్తిడి!

ఇలియానా తన అందాలతో ఎంతగా మాయ చేస్తుందో ఈ పిక్ చూస్తే అర్థం అవుతుంది. ఇంతలా అందాలు వెదజల్లుతున్నప్పటికీ ఇలియానాకు సరైన సక్సెస్ దక్కడం లేదు. ఇలియానా చివరగా తెలుగులో అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించింది. 

ఆ మధ్యన ఇలియానా తన ప్రియుడు ఆండ్రూతో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమలో విఫలమయ్యాక డిప్రెషన్ లోకి వెళ్లినట్లు కూడా ఇలియానా చెప్పుకొచ్చింది. చికిత్స తీసుకుని కోలుకుందట.