దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత జక్కన్న నుంచి వస్తున్న చిత్రం ఇదే. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో 1920 కాలానికి సంబందించిన కథగా తెరకెక్కుతోంది. రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. 

ఈ చిత్ర అప్డేట్స్ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కానీ రాజమౌళి మాత్రం సీక్రెట్ మైంటైన్ చేస్తున్నారు. నటీనటులు, కథకు సంబంధించిన కొన్ని వివరాలని మాత్రం రాజమౌళి ఇప్పటికే తెలియజేశారు. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. 

ఆర్ఆర్ఆర్ మూవీలో క్రేజీ హీరోయిన్ శ్రీయ శరన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఓ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు. అజయ్ దేవగన్ భార్యగా శ్రీయ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అజయ్ దేవగన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. దీనితో త్వరలో షూటింగ్ లో పాల్గొనేందుకు శ్రీయ కూడా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

చిత్రంలోని ఇతర పాత్రల తరహాలోనే శ్రీయ రోల్ కూడా చాలా కీలకమైనది అని అంటున్నారు. శ్రీయ ఇప్పటికే ఛత్రపతి చిత్రంలో రాజమౌళి దర్శత్వంలో నటించింది. త్వరలో శ్రీయ పాత్ర గురించి ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. 

కత్రినా గ్లామర్ డోస్ ఇప్పట్లో తగ్గేలా లేదు (హాట్ ఫొటోస్)

రామ్ చరణ్ కు హీరోయిన్ గా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ తో పాటు సముద్రఖని కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రం నిర్మించబడుతోంది. ముందుగా ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేయాలని భావించారు. కానీ ఈ చిత్రం అక్టోబర్ కు వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.