Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss3: బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్.. శ్రీముఖి ఆశలు గల్లంతు!

దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.

Rahul wins Bigg Boss 3 Telugu Title
Author
Hyderabad, First Published Nov 3, 2019, 10:33 PM IST

దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఆదివారం రోజు జరిగిన గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా రాహుల్ సిప్లిగంగ్ నిలిచాడు. 

అలీ రెజా, వరుణ్, బాబా ఎలిమినేట్ కావడంతో రాహుల్, శ్రీముఖి ఇద్దరు ఫైనలిస్టులుగా నిలిచారు. దీనితో వీరివుద్దరిలో విజేత ఎవరనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఫైనల్ విజేతని ప్రకటించేందుకు ఓ సర్ ప్రైజ్ గెస్ట్ వచ్చారు. అలాంటి ఇలాంటి గెస్ట్ కాదు. మెగాస్టార్ చిరంజీవే అతిథిగా రావడం విశేషం. 

Rahul wins Bigg Boss 3 Telugu Title

ఫైనల్ విజేతని ప్రకటించే ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. నాగార్జున వేదికని వదలి హౌస్ లోకి వెళ్ళారు. శ్రీముఖి, రాహుల్ కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. విన్నర్ ఫ్రైజ్ మని 50 లక్షలు. మీరిద్దరూ కాంప్రమైజ్ అయితే చెరో 25 లక్షలు సమానంగా పంచుకోవచ్చు. విజేతని ప్రకటిస్తే ఒకరు తప్పకుండా రన్నర్ అయిపోతారు. ఆలోచించుకోండి అని ఆఫర్ ఇచ్చాడు. 

Bigg Boss 3: రూ.20 లక్షల ఆఫర్.. షాకిచ్చిన హౌస్ మేట్స్!

కానీ శ్రీముఖి, రాహుల్ ఇద్దరూ నాగ్ ఇచ్చిన ఆఫర్ ని అంగీకరించలేదు. దీనితో వారిద్దరిని తీసుకుని నాగ్ వేదికపైకి వెళ్లారు. బిగ్ బాస్ 3 టైటిల్ విజేతకు ట్రోఫీ అందించేందుకు మెగాస్టార్ చిరంజీవిని నాగార్జున అతిథిగా ఆహ్వానించారు. బిగ్ బాస్ షో ఇంతటి ప్రేక్షకాదరణ పొంది తనని ఆశ్చర్యానికి గురిచేసిందని చిరంజీవి అన్నారు. బిగ్ బాస్ ని చిరంజీవి ఓ రిక్వస్ట్ చేశారు. నాగార్జున ఏవీని తనకు చూపించాలని అడిగారు. నాగార్జున ఏవీ ప్రేక్షకులతో పాటు నాగార్జునని కూడా మెప్పించింది. 

Bigg Boss3: బంపర్ ఆఫర్ వదిలేసి దెబ్బై పోయాడు.. వరుణ్ అవుట్!

ఇక విజేతని ప్రకటించే సమయం ఆసన్నమయ్యాక శ్రీముఖి, రాహుల్ చేతులని నాగ్ పట్టుకున్నారు. ఒక్కసారిగా రాహుల్ చేయి పైకి ఎత్తి విజేతగా నిలిచినట్లు నాగార్జున ప్రకటించారు. దీనితో బిగ్ బాస్ 3 టైటిల్ విజేతగా రాహుల్ నిలిచాడు. శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ కి చిరంజీవి బిగ్ బాస్ 3 టైటిల్ ట్రోఫీ అందించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios