తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం లో బాగంగా యాంకర్ సుమ కనకాల విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని రాహుల్ సిప్లిగంజ్ స్వీకరించారు.  మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు.

విశ్వక్సేన్ నాయుడితో పాటు  , పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ , వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గార్లని నామినేటెడ్ చేశారు . తన జీవితంలో మొదటి సారి ప్రకృతిని పరిచయం చేసుకునే అవకాశం ఇచ్చిన సుమ కనకాల గారికి , దీన్ని ప్రారంభించిన జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి కి ప్రత్యేకంగా అభినందింస్తున్నాను అని సింగర్ రాహుల్ మీడియాకు వివరించారు.

also read: మిస్ యూ రాహుల్.. పునర్నవి షాకింగ్ కామెంట్

తెలుగు బుల్లితెరపై సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ మరో సిజన్ ని సక్సెస్ ఫుల్ ఆ ఫినిష్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి కంటెస్టెంట్స్ మధ్య రిలేషన్ డోస్ కాస్త ఎక్కువయ్యిందనే చెప్పాలి. అందులో ఒక జోడి లవర్స్ అంటూ రోజుకో రూమర్ షో పై మంచి బజ్ క్రియేట్ చేసింది.  ఇకపోతే విన్నర్ గా నిలిచిన రాహుల్ మొన్నటివరకు ఇంటర్వ్యూలతో బిజీగా కనిపించాడు.

టబు హాట్ పిక్స్.. @48లో కూడా తగ్గని అందాల ఘాటు

పునర్నవిని ప్రస్తావిస్తూ అతనికి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆమె ఫ్రెండ్ కంటే ఎక్కువ అని రాహుల్ సమాధానం ఇస్తూ వచ్చాడు. ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రీ యూనియన్ అంటూ పార్టీలతో తెగ సందడి చేశారు. ముఖ్యంగా పునర్నవి ప్రతిపార్టీలో అటెండ్ అవుతూ వచ్చింది. కానీ రీసెంట్ గా పునర్నవి సమక్షంలో జరిగిన పార్టీలో రాహుల్ కనిపించలేదు. దీంతో సోషల్ మీడియా ద్వారా ఆమె మిస్ యూ రాహుల్ అని కామెంట్ చేయడం వైరల్ గా మారింది.  

పునర్నవి ఆ కామెంట్ మామూలుగానే అన్నప్పటికీ ముందు నుంచి ఉన్న పుకార్లకు ఈ కామెంట్ కాస్త  బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. రాహుల్ కూడా ఆమెతో మంచి రిలేషన్ ఉందని చెప్పడంతో కొన్ని మీడియాల్లో డేటింగ్ కథనాలు ప్రసారం చేస్తున్నారు. అయితే పునర్నవి మాత్రం రాహుల్ పై పెద్దగా కామెంట్ చేయడానికి ఇష్టపడటం లేదు. హౌజ్ లో ఉన్నప్పుడు వారి మధ్య రిలేషన్ ఓ రేంజ్ లో వైరల్ అయినప్పటికీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదు. మరి ఈ దారం లేని రూమర్ గాలిపటం ఎంతవరకు వెళుతుందో చూడాలి.