Asianet News TeluguAsianet News Telugu

మిస్ యూ రాహుల్.. పునర్నవి షాకింగ్ కామెంట్

సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ మరో సిజన్ ని సక్సెస్ ఫుల్ ఆ ఫినిష్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి కంటెస్టెంట్స్ మధ్య రిలేషన్ డోస్ కాస్త ఎక్కువయ్యిందనే చెప్పాలి. 

punarnavi comments on bigg boss 3 winner rahul
Author
Hyderabad, First Published Nov 17, 2019, 12:19 PM IST

తెలుగు బుల్లితెరపై సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ మరో సిజన్ ని సక్సెస్ ఫుల్ ఆ ఫినిష్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి కంటెస్టెంట్స్ మధ్య రిలేషన్ డోస్ కాస్త ఎక్కువయ్యిందనే చెప్పాలి.

punarnavi comments on bigg boss 3 winner rahul

అందులో ఒక జోడి లవర్స్ అంటూ రోజుకో రూమర్ షో పై మంచి బజ్ క్రియేట్ చేసింది.  ఇకపోతే విన్నర్ గా నిలిచిన రాహుల్ మొన్నటివరకు ఇంటర్వ్యూలతో బిజీగా కనిపించాడు. పునర్నవిని ప్రస్తావిస్తూ అతనికి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆమె ఫ్రెండ్ కంటే ఎక్కువ అని రాహుల్ సమాధానం ఇస్తూ వచ్చాడు.

read also:మన సంగీత దర్శకుల రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా?

ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రీ యూనియన్ అంటూ పార్టీలతో తెగ సందడి చేశారు. ముఖ్యంగా పునర్నవి ప్రతిపార్టీలో అటెండ్ అవుతూ వచ్చింది. కానీ రీసెంట్ గా పునర్నవి సమక్షంలో జరిగిన పార్టీలో రాహుల్ కనిపించలేదు. దీంతో సోషల్ మీడియా ద్వారా ఆమె మిస్ యూ రాహుల్ అని కామెంట్ చేయడం వైరల్ గా మారింది.  పునర్నవి ఆ కామెంట్ మామూలుగానే అన్నప్పటికీ ముందు నుంచి ఉన్న పుకార్లకు ఈ కామెంట్ కాస్త  బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.

punarnavi comments on bigg boss 3 winner rahul

రాహుల్ కూడా ఆమెతో మంచి రిలేషన్ ఉందని చెప్పడంతో కొన్ని మీడియాల్లో డేటింగ్ కథనాలు ప్రసారం చేస్తున్నారు. అయితే పునర్నవి మాత్రం రాహుల్ పై పెద్దగా కామెంట్ చేయడానికి ఇష్టపడటం లేదు. హౌజ్ లో ఉన్నప్పుడు వారి మధ్య రిలేషన్ ఓ రేంజ్ లో వైరల్ అయినప్పటికీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదు. మరి ఈ దారం లేని రూమర్ గాలిపటం ఎంతవరకు వెళుతుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios