కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 చివర్లో రసవత్తరంగా మారుతోంది. ఇప్పటి వరకు హౌస్ లో గట్టి పోటీనిచ్చిన శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, వరుణ్, అలీ రెజా ఫైనల్ కు చేరారు. వీరిలో విజేతగా ఎవరు నిలుస్తారనేదానిపై ప్రేక్షకుల్లో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. 

సగం సీజన్ గడిచేవరకు రాహుల్ అసలు ఏమాత్రం రేసులో లేదు. పునర్నవితో లవ్ ట్రాక్ సాగించడానికి రాహుల్ సమయం మొత్తం వృధా చేశాడు. అదృష్టమో, శ్రీముఖితో గొడవ వల్ల వచ్చిన సింపతీనో తెలియదు కానీ రాహుల్ ఈ సీజన్ లో ఫైనల్ చేరుకున్న తొలి కంటెస్టెంట్. 

కాగా ఆదివారం రోజు జరిగిన ఎపిసోడ్ లో రాహుల్ నుంచి విజయ్ దేవరకొండ ఓ సీక్రెట్ రాబట్టాడు. విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి 'మీకు మాత్రమే చెప్తా' చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నవంబర్ 1న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రచారం కోసం విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ బిగ్ బాస్ హౌస్ లోకి గెస్ట్ లు గా ఎంట్రీ ఇచ్చారు. 

మొదట విజయ్ దేవరకొండ సీక్రెట్ గా కన్ఫెషన్ రూమ్ లో ఉన్నాడు. ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా వెళ్లి అతడిని కలుసుకున్నారు. మీకు మాత్రమే తెలిసిన, హౌస్ లో జరిగిన ఓ సీక్రెట్ ని తనతో పంచుకోవాలని విజయ్ కోరాడు. ఈ సందర్భంగా రాహుల్ పునర్నవి గురించి ఇంట్రెస్టింగ్ సీక్రెట్ బయట పెట్టాడు. 

bigg boss3: బూతులతో రెచ్చిపోయిన రాహుల్.. వీడియో వైరల్

Bigg Boss 3: హౌస్ లో యాంకర్ సుమ రచ్చ!

పునర్నవిని సేవ్ చేయడం కోసం రాహుల్ 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పునర్నవి బహిరంగంగానే రాహుల్ ని ముద్దు పెట్టుకుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. మా ఇద్దరి గురించి తెలియని మరో విషయం ఉంది. 

ఓ సారి కోపంతో పునర్నవి తన చేయి కొరికి పారిపోయిందని రాహుల్ తెలిపాడు. రాహుల్ చెప్పిన ఈ విషయంపై నాగార్జున సరదాగా సెటైర్లు వేశాడు. వితిక కితకితలు పెడితే పెద్ద రాద్ధాంతం చేశావు. కానీ పునర్నవి కొరికినా ఎవ్వరికీ చెప్పకుండా సైలెంట్ గా ఉన్నావు అని నాగ్ సరదాగా కామెంట్ చేశాడు.