బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో షో పూర్తి కానుంది. టైటిల్ ఎవరు గెలుచుకోబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతోంది. గత వారం మొత్తం కఠినమైన టాస్క్ లతో షో నడిపించిన బిగ్ బాస్ ఈ వారం ఎంటర్టైనింగ్ షో నడిపించబోతున్నారు. ఇందులో భాగంగా యాంకర్ సుమని హౌస్ లోకి పంపించారు.

bigg boss3: బూతులతో రెచ్చిపోయిన రాహుల్.. వీడియో వైరల్

బుల్లితెరపై సుమకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఎంతమంది యాంకర్లు వస్తున్నా.. సుమ మాత్రం టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది. కౌంటర్లు, పంచ్ లు వేయడంలో ఆమె తరువాతే ఎవరైనా.. అటువంటి సుమ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉంటుందా..?

ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో సుమ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సుమని చూడగానే హౌస్ మేట్స్ సర్ప్రైజ్ అయ్యారు. బాబా భాస్కర్.. సుమక్క అనగానే .. 'ఏంటి అక్కా.. మీకు నేను అక్కా..?' అంటూ తనదైన స్టైల్ లో పంచ్ వేసింది.

 

 

హౌస్ మేట్స్ అందరితో ఫన్నీ టాస్క్ లు ఆడిస్తూ రచ్చ రచ్చ చేసింది. సుమ ఎంట్రీతో హౌస్ మొత్తం కోలాహలంగా మారింది. కామెడీ ఓ రేంజ్ లో పండింది.