బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ రేజ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. షో ఎండింగ్ కి వస్తుండడంతో ఆడియెన్స్ మరింతగా ఎట్రాక్ట్ అవుతున్నారు. కంటెస్టెంట్స్ ని గెలిపించేందుకు సోషల్ మీడియాలో ఆర్మీలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇక ఫైనల్ లోకి ప్రవేశించిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కూడా సోషల్ మీడియాలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.

అయితే ట్రోలింగ్స్ కూడా అదే రేంజ్ లో కొనసాగుతోంది. ప్రత్యర్థి అభిమానులు కంటెస్టెంట్స్ కి సంబందించిన నెగిటివ్ పాయింట్స్ బాగా ఎలివేట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకీ ఓట్లు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని పెదవి విరుస్తున్నారు. ఇక రీసెంట్ గా రాహుల్ కి సంబందించిన ఒక వీడియోని కూడా బాగా వైరల్ చేస్తున్నారు.  గతంలో బిగ్ బాస్ సీజన్ 1లో రాహుల్ కంపోజ్ చేసి పాడిన మంగమ్మ సాంగ్ ని ప్లే చేశారు.

దీక్షా పంత్ ఎంట్రీ ఇవ్వగానే ఆ సాంగ్ వచ్చింది. అయితే కొంత మంది  సాంగ్ ని  తక్కువ చేసి మాట్లాడారని ఆగ్రహంతో రాహుల్ బండబూతులు తిట్టాడు. అప్పట్లో ఆ వీడియో అంతగా వైరల్ కాలేదు.అయితే ఇప్పుడు రాహుల్ పై ఆక్రోశంతో కొందరు మళ్ళీ ఆ వీడియోకి ప్రచారాలు కల్పిస్తున్నారు. ఇలాంటి మనిషికి ఓట్లు వేసి గెలిపించడం ఎంతవరకు న్యాయం అంటూ కొటేషన్స్ వదులుతుండడంతో రాహుల్ ఫ్యాన్స్ అందుకు దీటుగా కౌంటర్లు వేస్తున్నారు.

ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో టాప్ 5 ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుతం శివజ్యోతి, వరుణ్, అలీ రెజా నామినేషన్ లో ఉన్నారు. వారిలో శివజ్యోతి ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. దీనితో వరుణ్, అలీ రెజా సేఫ్ అయి టాప్ 5లోకి వెళ్లారు. 

అంతకు ముందు బిగ్ బాస్ షో చాలా వినోదాత్మకంగా జరిగింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ షోలోకి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ మేట్స్ తో సరదాగా గడిపారు. నాగార్జున విజయ్ దేవరకొండ ని సీక్రెట్ రూమ్ లో హౌస్ మేట్స్ తెలియకుండా ఉంచారు. 

హౌస్ మేట్స్ కి మాత్రం మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కో గెస్ట్ సీక్రెట్ రూమ్ లో కలుసుకుంటారు. ఆ గెస్ట్ ఎవరో బయటకు వచ్చాక చెప్పకూడదు అని నాగ్ కండిషన్ పెట్టారు. హౌస్ మేట్స్ మాత్రం తాము ఒక్కొక్కరం ఒక్కో గెస్ట్ ని కలుసుకోబోతున్నట్లు భ్రమపడ్డారు. ఒకరి తర్వాత ఒకరు సీక్రెట్ రూమ్ కి వెళ్లి వచ్చారు. 

కానీ వారంతా కలుసుకుంది విజయ్ దేవరకొండనే. విజయ్ దేవరకొండ హౌస్ మేట్స్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కో సీక్రెట్ తెలుసుకున్నాడు.శ్రీముఖి తనకు బాబా భాస్కర్ ని ఎలిమినేట్ చేయాలని ఉందని విజయ్ తో చెప్పింది. ఇటీవల బాబా ఎక్కువగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడని శ్రీముఖి అభిప్రాయపడింది. 

ఇక రాహుల్ తన సీక్రెట్ గురించి విజయ్ తో చెబుతూ.. పునర్నవి తన చేయి కోరికేసింది ఈ విషయం ఎవరికీ తెలియదని రాహుల్ తెలిపాడు. విజయ్ దేవరకొండ తనని కలసిన ఒక్కొక్కరికి ఒక్కో బెలూన్ ఇచ్చి పంపాడు. 

ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత విజయ్ దేవరకొండ తన 'మీకు మాత్రమే చెప్తా' చిత్ర యూనిట్ తో కలసి వేదికపైకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ మేట్స్ తో ముచ్చటించిన తర్వాత విజయ్ ఓ బెలూన్ ని పగలగొట్టారు. ఆ బెలూన్ లో వరుణ్ పేరు ఉంది. దీనితో వరుణ్ నామినేషన్ నుంచి సేఫ్ అవుతున్నట్లు నాగ్ ప్రకటించారు. 

ఇక మిగిలిన అలీ రెజా, శివజ్యోతిలలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. నాగ్ ఓ బోర్డుపై 'BIGG BOSS' అక్షరాలని వెనక్కి తిప్పుతూ వచ్చాడు. అందులో వెనుక శివజ్యోతి ఫోటో ఉంది. దీనితో శివజ్యోతి ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు. 

తాను ఎలిమినేట్ కావడంతో శివజ్యోతి ఎమోషనల్ అయింది. శ్రీముఖిని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. శ్రీముఖి కూడా ఎమోషనల్ అయింది. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్, బాబా భాస్కర్, వరుణ్, అలీ రెజా, శ్రీముఖి టాప్ 5 గా నిలిచారు. 

ఆ పొట్టి డైరెక్టర్ కి గట్టిగా ఇచ్చా.. నటి హేమ షాకింగ్ కామెంట్స్!