డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం ఉంది. స్టార్ హీరోలకు, యంగ్ హీరోలకు పూరి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. ఇటీవల పూరి జగన్నాధ్ వరుస పరాజయాలతో రేసులో వెనుకబడ్డారు అని భావిస్తున్న తరుణంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సర్ ప్రైజ్ చేశారు. 

హీరో రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్ నటించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనితో పూరి జగన్నాధ్ తిరిగి పుంజుకున్నారు. ప్రస్తుతం పూరి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో 'ఫైటర్' అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. 

అంచనాలు పెంచేస్తున్న వరుణ్ తేజ్ మూవీ.. పవన్ కళ్యాణ్ సినిమా స్ఫూర్తితో

ఈ చిత్రం భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల చేయాలని పూరి జగన్నాధ్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి పూరి జగన్నాధ్, ఛార్మి భారీ ఏర్పాట్లు చేస్తున్నారట. పాన్ ఇండియా చిత్రం కావడంతో టాలీవుడ్ తో పాటు ఇతర చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖుల్ని కూడా ఈ మూవీ లాంచింగ్ కార్యక్రమానికి ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం పూరి, ఛార్మి ఇప్పటికే కొందరు ప్రముఖుల్ని కలసినట్లు తెలుస్తోంది. 

సుకుమార్, అల్లు అరవింద్ లతో హీరో నిఖిల్ చిత్రం.. క్రేజీ కాంబినేషన్ ఖరారు!

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి చిత్రాలతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఈ రౌడీ హీరో పూరి జగన్నాధ్ తో చేతులు కలపడంతో ఫైటర్ చిత్రంపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.