ప్రియప్రకాష్ వారియర్.. ఈ పేరు వినని యువత ఉండరు. 2018లో ప్రియా వారియర్ యూట్యూబ్ సెన్సేషన్ గా మారిపోయింది. ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని ఓ పాటలో ప్రియా వారియర్ కన్నుగీటిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. యువతతో పాటు సెలెబ్రిటీలు కూడా ప్రియా హావభావాలకు ఫిదా అయిపోయారు. 

అప్పటివరకు ఎవరికీ తెలియని ప్రియా వారియర్ ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఆ తర్వాత ప్రియవారియర్ నటించిన ఒరు ఆధార్ లవ్ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజై నిరాశపరిచింది. కానీ ప్రియా వారియర్ కు మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం ప్రియా వారియర్ టాలీవుడ్ లో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. 

ప్రియవారియర్ ఎదిరిచూపులు ఫలించే తరుణం వచ్చినట్లు ఉంది. క్రమంగా ప్రియా వారియర్ కు టాలీవుడ్ నుంచి ఆఫర్స్ పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం నితిన్ సరసన ప్రియా వారియర్ ఓ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న భీష్మ చిత్రం పూర్తయితే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వస్తుంది. 

కళ్యాణ్ రామ్ రియలైజ్ అయ్యాడా.. స్ట్రాంగ్ డెసిషన్!

తాజాగా ప్రియా వారియర్ మరో టాలీవుడ్ యంగ్ హీరోతో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుందట. యంగ్ హీరో నాగ శౌర్య తదుపరి చిత్రంలో ప్రియా వారియర్ హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. నాగ శౌర్య ప్రస్తుతం అశ్వథ్థామ చిత్రంలో నటిస్తున్నాడు. జనవరి 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

చిరు, కొరటాల మూవీ క్రేజ్.. అప్పుడే కొనేసిన స్టార్ ప్రొడ్యూసర్?

క్యూట్ లుక్స్ లో ఆకట్టుకునే ప్రియా వారియర్ కుర్రహీరోల సరసన ప్రేమ కథా చిత్రాలకు సరిపోతుందని టాలీవుడ్ డైరెక్టర్స్ భావిస్తున్నారు. అందుకే ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ రెండు చిత్రాలలో ప్రియా వారియర్ మెప్పిస్తే టాలీవుడ్ లో ఆమె పాతుకుపోవడం ఖాయం.