గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిగా సందడి చేశాడు. ఈ ఏడాది చిరు నుంచి మరో క్రేజీ చిత్రం రాబోతోంది. కొరటాల శివ దర్శత్వంలో చిరంజీవి 152వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల చిరంజీవిని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

సోషల్ మెసేజ్ కూడుకున్న అద్భుతమైన కథతో కొరటాల, చిరంజీవి చిత్రం తెరకెక్కుతోంది. మెగాస్టార్ సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొరటాల దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ట్రేడ్ లో మరింత ఎక్కువగా పోటీ కనిపిస్తోంది. కొరటాల, చిరు కాంబినేషన్ దృష్టిలో పెట్టుకుని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందుగానే ఈ చిత్ర నైజాం రైట్స్ కోసేశారట. 

చిరు 152 నైజాం రైట్స్ ఎంతకు అమ్ముడయ్యాయనే విషయం బయటకు రాలేదు కానీ దిల్ రాజు మాత్రం భారీ మొత్తం వెచ్చించే హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. దిల్ రాజు ఇంత ముందు చూపుతో వ్యవహరిస్తారు కాబట్టే సినిమా బిజినెస్ లో ఆయన స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయారు. 

ఈ ఏడాది దిల్ రాజు అదిరిపోయే ఆరంభం చేశారు. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సహ నిర్మాత అయిన దిల్ రాజు.. అల వైకుంఠపురములో చిత్రాన్ని కూడా నైజాం లో డిస్ట్రిబ్యూట్ చేశారు. రెండు చిత్రాలు బంపర్ హిట్స్ గా నిలిచి లాభాల పంట పండించాయి. 

ఎన్టీఆర్, ప్రభాస్ తో ఊపేసింది.. ఆమె కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువే!

ఇక చిరు 152 విషయానికి వస్తే.. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతి అంశంపై కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపిస్తారు. చాలా కాలం తర్వాత మణిశర్మ చిరంజీవి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.