నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. అప్పుడప్పుడూ ఒక హిట్ మినహా ఈ నందమూరి హీరో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయితున్నాయి. కళ్యాణ్ రామ్ అతనొక్కడే చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 

కమర్షియల్ హీరోగా ఎదిగే సత్తా తనకు ఉందని అతనొక్కడే చిత్రంతో నిరూపించుకున్నాడు. కానీ ఆ జోరు ఎక్కువరోజులు కొనసాగలేదు. వరుసగా ఫ్లాపులు ఎదురవుతున్న తరుణంలో కళ్యాణ్ రామ్ కు పటాస్ లాంటి సూపర్ హిట్ చిత్రం పడింది. పటాస్ తర్వాత మరోసారి పరజయాలె ఎదురయ్యాయి. 

దీనితో విభిన్నంగా ప్రయత్నించిన 118 చిత్రం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇటీవల కళ్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచివాడవురా' చిత్రం సంక్రాంతికి విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. రాంగ్ టైంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడం ఓ కారణంగా చెబుతున్నారు. 

సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో లాంటి భారీ చిత్రాల నడుమ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం బెబ్బ కొట్టింది. ఇక కళ్యాణ్ రామ్ పూర్తి స్థాయిలో ఫ్యామిలీ సబ్జెక్టు ఎంచుకోవడం కూడా కలసి రాలేదని అంటున్నారు. 

చిరు, కొరటాల మూవీ క్రేజ్.. అప్పుడే కొనేసిన స్టార్ ప్రొడ్యూసర్?

ఎంత మంచివాడవురా చిత్రం విషయంలో తాను తీసుకున్న నిర్ణయం పట్ల కళ్యాణ్ రామ్ తీవ్ర నిరాశలో ఉన్నాడట. ఇకపై ప్రయోగాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాలపైనే దృష్టి పెట్టాలని కళ్యాణ్ రామ్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శత్వంలో తెరకెక్కిన ఎంత మంచి వాడవురా చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.