విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా హాట్ టాపిక్. నేషనల్ మీడియా సైతం ప్రకాష్ రాజ్ గురించి కథనాలు ప్రచురిస్తోంది. అందుకు కారణం ప్రకాష్ రాజ్ చేస్తున్న రాజకీయ విమర్శలే. నేరుగా ప్రధాని మోడీ, బిజెపిపై ప్రకాష్ రాజ్ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ ఇప్పటికి సౌత్ లో తిరుగులేని నటుడు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునేది ప్రకాష్ రాజే. ఇటీవల ప్రకాష్ రాజ్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించారు. ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్నారు. 

తాజాగా ప్రకాష్ రాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ కంపెనీకి రూ 5 కోట్ల చెల్లింపు వ్యవహారంలో ప్రకాష్ రాజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రకాష్ రాజ్ చెక్ బౌన్స్ కావడంతో సదరు కంపెనీ కోర్టుని ఆశ్రయించింది. దీనితో ప్రకాష్ రాజ్ కు సమన్లు అందాయి. 

నో ఎక్స్‌పోజింగ్.. క్యూట్ లుక్స్ తోనే చంపేస్తోంది.. ఒక్క హిట్ పడితే..

ఏప్రిల్ 2న విచారణకు హాజరు కావాలని కోర్టు ప్రకాష్ రాజ్ ని ఆదేశించింది. రీసెంట్ గా బిగ్ బాస్ విజేత రాహుల్ పై పబ్బులో జరిగిన దాడి వ్యవహారంలో కూడా ప్రకాష్ రాజ్ కలగజేసుకున్నారు. రాహుల్ కి మద్దతు తెలుపుతూ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేశాడు. 

'విజయ్ దేవరకొండ జిరాక్స్'.. వల్గర్ కామెంట్స్ తో రెచ్చిపోయిన శ్రీరెడ్డి!