దర్శకుడిగా, నటుడిగా, రచయితగా పోసాని కృష్ణమురళికి టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం దర్శకత్వం, రచన తగ్గించిన పోసాని నటుడిగా బిజీ అయిపోయారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కామెడీ విలన్ గా అద్భుతమైన చిత్రాలు చేస్తున్నారు. బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే రాజకీయ పరంగా కూడా పోసాని హాట్ టాపిక్ గా మారుతున్నారు. 

అప్పుడప్పుడూ పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్స్ పెట్టి చేసే విమర్శలు సంచలనం రేపుతుంటాయి. ఇటీవల పోసాని.. నటుడు, ఎస్వీబిసి చైర్మన్ అయిన పృథ్వి రాజ్ పై తీవ్రమైన విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. చాలా కాలం నుంచి పోసాని కృష్ణమురళి వైసిపి మద్దతు దారుడిగా కొనసాగుతున్నారు. 

పలు సందర్భాల్లో పోసాని కృష్ణమురళి సీఎం జగన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో జగన్ తనకు పలు రాజకీయ పదవులు ఆఫర్ చేసారని అన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్, రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు పోసాని తెలిపారు. 

తన ఇంటికి కొందరు వైసిపి నేతలని జగన్ పంపారని.. వారి ద్వారా తనకు పదవులు ఆఫర్ చేశారని అన్నారు. కానీ జగన్ ఇచ్చిన ఆఫర్ ని తాను సున్నితంగా తిరస్కరించినట్లు పోసాని చెప్పారు. తనకు సినిమాలంటేనే ఇష్టం అని.. నటుడిగా మాత్రమే కొనసాగుతానని పోసాని వారికి చెప్పినట్లు తెలిపారు. 

హీరో కూతురి సంచలనం.. రూ.30 కోట్ల సంపాదన.. రెండు సినిమాలకే ఎలా!

రాజకీయాలపై కూడా ఆసక్తి ఉంది. కానీ పదవులు తీసుకుంటే ప్రశాంతత ఉండదు. అందుకే తనకు ఎలాంటి పదవి వద్దని చెప్పినట్లు పోసాని చెప్పుకొచ్చారు. జగన్ కు ఎప్పుడూ మద్దతునిస్తా.. కానీ పదవులు వద్దు. తాను చనిపోయే వరకు జగన్ ప్రేమతో మాట్లాడితే చాలు అని తన ఇంటికి వచ్చినవారికి చెప్పి పంపినట్లు పోసాని అన్నారు. 

రోజాపై సెటైర్.. అనసూయకి కూడా లోకువైపోయిందా!

పోసాని సమాధానం తెలుసుకున్న జగన్ నవ్వుకుని ఊరుకున్నారట. చివరకు ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా తాను ఎమ్మెల్యే టికెట్ అడగలేదని.. చిరంజీవే పిలిచి మరీ ఇచ్చారని పోసాని పలు సంధర్భాల్లో తెలిపారు.