హీరోయిన్ గా రాణించాలన్నా, చేతినిండా డబ్బులు సంపాదించాలన్నా అదృష్టం ఎంతోకొంత ఉండాలి. చాలా మంది నటీమణులు అద్భుతమైన నటనతో మెప్పించినప్పటికీ వారి సంపాదన అంతంత మాత్రంగానే ఉంటుంది. కొందరు హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే సంచలనంగా మారిపోతారు. ప్రస్తుతం బాలీవుడ్ లో దీపికా పదుకొనె, కంగనారనౌత్, అలియా భట్, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లు ఉన్నారు. 

తరువాతి తరం హీరోయిన్లుగా కొందరు యంగ్ బ్యూటీలు ఇప్పటికే సినిమాలు మొదలు పెట్టేశారు. వారిలో జాన్వీ కపూర్, సారా అలీఖాన్ లాంటి ముద్దుగుమ్మలు ఉన్నారు. బాలీవుడ్ లో స్టార్ వారసుల హవా ఎక్కువగా ఉంటుంది. జాన్వీ, సారా కూడా స్టార్ వారసులుగానే బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా సారా అలీఖాన్ బాలీవుడ్ లో ప్రస్తుతం మ్యాజిక్ చేస్తోంది. సైఫ్ అలీఖాన్ కుమార్తెగా సారా అలీఖాన్ కేదార్ నాథ్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

కేదార్ నాథ్, సింబా చిత్రాల్లో సారా గ్లామర్ తో ఆకట్టుకుంది. చూడగానే ఆకర్షించే అందం సారా అలీఖాన్ సొంతం. ఇక చలాకీగా మాట్లాడడం, సెన్సాఫ్ హ్యూమర్ కూడా బాగా ఉండడంతో బాలీవుడ్ ప్రేక్షకులంతా సారా అలీఖాన్ కు ఫిదా అయిపోయారు. దీనితో కేవలం రెండు చిత్రాలతోనే సారా సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. 

ఆమె పాపులారిటీ గమనించిన కార్పొరేట్ సంస్థలు భారీ ఎండార్స్మెంట్ డీల్ తో సారా ఇంటి వద్ద క్యూ కడుతున్నాయి. సారా అలీ ఖాన్ తో తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టేశాయి. గ్రానీయర్, వివో, ఫాంటా, పుమా లాంటి ప్రఖ్యాత సంస్థలు సారా అలీఖాన్ ని తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నట్లు తెలుస్తోంది. 

రోజాపై సెటైర్.. అనసూయకి కూడా లోకువైపోయిందా!

ఈ సంస్థల ద్వారా సారా అలీఖాన్ దాదాపు రూ30 కోట్ల వరకు భారీ పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే త్వరలోనే ఎండార్స్మెంట్ లో సారా అలీ ఖాన్.. దీపికా, అనుష్క శర్మ, కత్రినా లాంటి అగ్ర హీరోయిన్ల స్థాయిని అందుకోవడం ఖాయం అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.