బుల్లితెరపై క్రమంగా కామెడీ షోలు ఎక్కువవవుతున్నాయి. అందుకు కారణం మాత్రం జబర్దస్త్ అనే చెప్పాలి. జబర్దస్త్ షో సూపర్ హిట్ కావడంతో బుల్లితెరపై కామెడీ షోలకు ఆదరణ పెరిగింది. సినీ నటి, రాజకీయ నాయకురాలు అయిన రోజా జబర్దస్త్ లో జడ్జిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. 

స్కిట్ లలో భాగంగా కమెడియన్లు రోజా, నాగబాబు, అనసూయ, రష్మీ పై సెటైర్లు వేయడం చూస్తూనే ఉన్నాం. కానీ ఆ సెటైర్లు స్కిట్ లో భాగం కావడంతో వారు కూడా సరదాగా తీసుకునే వారు. తాజాగా రోజాపై యాంకర్ అనసూయ వేసిన సెటైర్ ఆసక్తిగా మారింది. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. 

ఓ ప్రముఖ ఛానల్ ప్రసారం చేసే లోకల్ గ్యాంగ్స్ షోలో యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్, అనసూయ పాల్గొంటున్నారు. అనసూయ, శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతలుగా కూర్చున్నారు. యాంకర్ ప్రదీప్ తనదైన శైలిలో ఫోన్ లో మాట్లాడుతున్నట్లు శేఖర్ మాస్టర్ పై జోక్స్ వేశాడు. 

ఇంకెక్కడ శేఖర్ మాస్టర్.. ఆయన మా మాస్టర్ అయిపోయాడు అని అంటాడు. మధ్యలో అనసూయ కల్పించుకుని 'ఆవిడ యాంకరింగా..లేక పార్టీలోనా' అని పరోక్షంగా రోజాని ఉద్దేశించి అనసూయ వ్యాఖ్యలు చేస్తుంది. ఆ సమయంలో బ్యాగ్రౌండ్ లో 'బతుకు జట్కా బండి' అంటూ మ్యూజిక్ వినిపిస్తుంది. 

ధగధగ మెరుపులు, చుట్టూ విచిత్రమైన ఫోటోలు.. ప్రభాస్ 20 అప్డేట్!

రోజాని ఉద్దేశించే ఈ సీన్ మొత్తం క్రియేట్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.మొత్తంగా లోకల్ గ్యాంగ్స్  షోలో అనసూయ గ్లామర్ తో అదరగొడుతూ.. హుషారుగా కనిపిస్తోంది. శేఖర్ మాస్టర్ తో అనసూయ చేసిన డాన్స్ చూస్తే మతిపోవాల్సిందే. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అయిన రోజా టీవీ కార్యక్రమాల్లో అనసూయకి కూడా లోకువైపోయిందా అనే వాదన వినిపిస్తోంది. 

జబర్దస్త్ ని వదలిపెట్టి నాగబాబు అదిరింది షో ప్రారంభించారు. అదిరింది, జబర్దస్త్ మధ్య కూడా కోల్డ్ వార్ జరుగుతోంది. క్రమంగా బుల్లితెరపై కూడా పోటీ తత్త్వం ఎక్కువవుతోంది.