మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన పాటలకు సూపర్ రెస్పాన్స్ వస్తుండడంతో చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది. 

సామజవరగమన, రాములో రాములా సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. అలా వైకుంఠపురములో చిత్రాన్ని జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాలని మరింత వేగవంతం చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. 

ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టీజర్ రెడీ చేస్తున్నారు. అల వైకుంఠపురములో టీజర్ పై చిత్ర పరిశ్రమలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. టీజర్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించబోతున్నట్లు టాక్. త్రివిక్రమ్ రిక్వస్ట్ మేరకు పవన్ కళ్యాణ్ అందుకు ఒపుకున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ఇదే కనుక నిజమైతే ఆల్రెడీ సూపర్ బజ్ సొంతం చేసుకున్న అల వైకుంఠపురములో చిత్రంపై మరింతగా అంచనాలు పెరిగిపోతాయి. 

నిత్యానందపై మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్!

పవన్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. పవన్ వాయిస్ ఓవర్ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఓ హీరో మరో హీరో చిత్రానికి వాయిస్ ఓవర్ అందించడం ఇదేమి కొత్త కాదు. గతంలో మహేష్ బాబు జల్సా చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. చిరంజీవి రుద్రమ దేవి చిత్రానికి వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. 

విజయ్ దేవరకొండ మూవీ.. పూరి, ఛార్మి ఏం చేయబోతున్నారంటే..!

అలా వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.డీజే తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ఇది. ఇక సీనియర్ హీరోయిన్ టబు, హీరో సుశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. హారికా అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.