వివాదాస్పద బాబా నిత్యానంత అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నిత్యానంద అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. చాలా రోజులుగా నిత్యానందపై ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. ఓ సందర్భంలో నిత్యానంద తాను అసలు మగాడిని కాదు అని ప్రకటించుకున్నాడు. చిన్నపిల్లలని కిడ్నాప్ చేసిన ఆరోపణలు కూడా నిత్యానందపై ఉన్నాయి. 

గుజరాత్ పోలీసులు నిత్యానందని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో అతడు దేశం విడచి పారిపోయాడు. విదేశాలకు పారిపోయిన నిత్యానంద గురించి ఆశ్చర్యకర వార్త వెలుగులోకి వచ్చింది. దక్షణ అమెరికాలోని ఓ ప్రాంతంలో నిత్యానంద ఐలాండ్ ని కొనుగోలు చేశాడట. ఆ ఐలాండ్ ని ఒక దేశంగా మార్చేసినట్లు తెలుస్తోంది. ఆ దేశానికి కైలాస అని పేరు పెట్టారు. 

ఆ దేశానికి ఒక ప్రధానిని, కేబినెట్ ని నిత్యానంద నియమించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై హీరో మంచు మనోజ్ ట్విట్టర్ లో స్పందించాడు. నిత్యానంద ఐలాండ్ ని దేశంగా మార్చేసిన విషయం గురించి తెలుసుకుని మనోజ్ ఆశ్చర్యపోయాడు. 

'ఏంటి.. ఈ వెధవ సొంతంగా ఐలాండ్ కొన్నాడా.. అతడు ఉన్న చోట ప్రభుత్వం ఒక బాంబు వేయాలి' అని మనోజ్ ట్వీట్ చేశాడు'. 

రీసెంట్ గా మనోజ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినదిశ అత్యాచారం, హత్య ఘటనపై స్పందించిన సంగతి తెలిసిందే. స్వయంగా దిశ ఇంటికి వెళ్లి ఆమె ఫ్యామిలీని మనోజ్ పరామర్శించాడు. మనోజ్ ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. తిరిగి సినిమాల్లో పుంజుకునేందుకు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ని కూడా ప్రారంభించాడు.