పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం మేలో రిలీజ్ రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు వకీల్ సాబ్ చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 

అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ లుక్ ని చూసిన అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. దీనితో అటు సోషల్ మీడియాలో, ఇటు బయట అభిమానుల హంగామా మాములుగా లేదు. ఇక ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి పవన్ అభిమానులు Vakeel Saab హ్యాష్ ట్యాగ్ ని ట్విట్టర్ లో ట్రెండింగ్ మొదలు పెట్టారు. 

అభిమానుల ట్రెండింగ్ తో వకీల్ సాబ్ చిత్రం సరికొత్త రికార్డులు ట్విట్టర్ లో క్రియేట్ చేసింది. అత్యధికంగా 25.3 వేల రీట్వీట్స్ సాధించిన ఫస్ట్ లుక్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో వకీల్ సాబ్ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. అదే విధంగా చిత్ర టైటిల్ తో అత్యధిక ట్వీట్స్ సాధించిన చిత్రంగా కూడా వకీల్ సాబ్ చిత్రం ఆల్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది. వకీల్ సాబ్ హ్యాష్ ట్యాగ్ తో 3.5 మిలియన్ల ట్వీట్స్ నమోదయ్యాయి. 

43 ఏళ్ల పవన్ హీరోయిన్ సెక్సీ ఫోజులు.. ఈమె ఎవరో గుర్తుపట్టారా!

గతంలో ఈ రికార్డు తమిళ హీరో విజయ్ మాస్టర్ చిత్రంపై ఉండేది. మాస్టర్ చిత్ర టైటిల్ ట్యాగ్ కి 3.4 మిలియన్ల ట్వీట్స్ నమోదయ్యాయి. ఇక మూడవ స్థానంలో అజిత్ వాలిమై చిత్రం 3 మిలియన్ల ట్వీట్స్ తో నిలిచింది. ఈ ఇద్దరు హీరోల చిత్రాలని అధికమించి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం అగ్రస్థానానికి చేరుకుంది. 

'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ పై సెలెబ్రిటీల రెస్పాన్స్.. దిల్ రాజు ఆఫీస్ ఎదుట సంబరాలు (ఫొటోస్)

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శత్వంలో తెరక్కుతున్న ఈ చిత్రంలో అంజలి, నివేత థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.