జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పింక్ రీమేక్ తో పవన్ చాలా కాలం తర్వాత వెండితెరపై మెరవబోతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న పింక్ రీమేక్ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ చిత్రానికి వకీల్ సాబ్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా పింక్ రీమేక్ తో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శత్వంలో చిత్రాన్ని కూడా ప్రారంభించాడు. క్రిష్ దర్శత్వంలో తెరకెక్కబోయే చిత్రం పీరియాడికల్ మూవీ. మొఘల్ సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా నటించబోతున్నాడు. పీరియాడికల్ మూవీ కావడంతో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. 

పింక్ రీమేక్ కోసం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గడ్డం లుక్ లో కనిపించాడు. ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ పార్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది. దీనితో పవర్ స్టార్ ప్రస్తుతం క్రిష్ చిత్రం కోసం కొత్త లుక్ లోకి మారిపోయాడు. క్లీన్ షేవ్, మీస కట్టులో పవన్ కళ్యాణ్ కనిపించిన ఫోటోలు ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జనసేన పార్టీ మీటింగ్ లో మెరిసిన పవన్ కొత్త లుక్ లో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు. 

పొడవుగా హెయిర్ కూడా పెంచుతున్నాడు. మొత్తంగా పవన్ కళ్యాణ్ కొత్త లుక్ ఫ్యాన్స్ ని క్రేజీగా మార్చేసింది. దీనితో PSPK27 అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది. కేవలం పవన్ లుక్ మాత్రమే కాదు.. చేతిపై ఉన్న టాటూ కూడా అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటోంది. పవన్ చేతిపై త్రిశూలం, ఢమరుఖం ఉన్న టాటూ వైరల్ గా మారింది. 

మొత్తంగా క్రిష్, పవన్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బోలెడు విశేషాలు ఉండబోతున్నాయి. ఇలాంటి పీరియాడిక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించడం ఇదే తొలిసారి. పీరియాడిక్ చిత్రం అయినప్పటికీ పవన్ పాత్ర ఎంటర్టైనింగ్ గా సాగేలా క్రిష్ ఈ కథ రాసుకునట్లు తెలుస్తోంది. ఏఎం రత్నం ఈ చిత్రానికి నిర్మాత. కీరవాణి సంగీత దర్శకుడు. 

ఆ హీరోయిన్ పై రూ.1500 కోట్లు.. షాకింగ్ డీటైల్స్!

బాబీతో ఓకె.. మరి ఆ డైరెక్టర్ తో.. ఇచ్చిన మాట కోసం పవన్ షాకింగ్ డెసిషన్!