జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడమే కాదు.. దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే పింక్ రీమేక్ ప్రారంభించిన పవన్.. మరో భారీ చిత్రానికి కూడా అంగీకారం తెలిపాడు. ప్రతిభగల దర్శకుడు క్రిష్ దర్శత్వంలో పవన్ కళ్యాణ్ ఓ చిత్రంలో నటించబోతున్నాడు. 

ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. ఏఎం రత్నం ఈ చిత్రానికి నిర్మాత. జనవరి 27న ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించబోతున్నాడు. హీరోయిన్ల విషయంలో అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. ఓ హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. మరో హీరోయిన్ పాత్రలో బాలీవుడ్ నటి నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

స్టేజి వెనుక మాజీ భర్తతో హీరోయిన్ రాసలీలలు.. వైరల్ అవుతున్న పిక్స్!

మొఘల్ సామ్రాజ్యానికి సంభందించిన కథ కావడంతో.. ఆ కాలం నాటి సెట్స్ రూపొందిస్తూ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించారు. ప్రస్తుతం క్రిష్ నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాడు. బుర్రా సాయి సాయి మాధవ్ ఈ చిత్రానికి మాటలు అందించనున్నారు. 

అల్లు అర్జున్ నిజమైన 'మెగా పవర్ స్టార్'.. కుంపటి పెట్టే ప్రయత్నమా?