హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ గురించి పరిచయం అవసరం లేదు. నటుడిగా ఎంత గుర్తింపు పొందాడో.. వ్యక్తిగత వ్యవహారాలతో కూడా అదే స్థాయిలో ఈ హీరో వార్తల్లో నిలిచాడు. హాలీవుడ్ అందాల భామలంతా ఈ నటుడి వలకు చిక్కున్నవారే. హాలీవుడ్ లో క్రేజీ నటిగా పేర్కొనబడే జెన్నిఫర్ అనిస్టన్ ని మొదట బ్రాడ్ పిట్ వివాహం చేసుకున్నాడు. 

ఐదేళ్ల పాటు వీరి కాపురం సాగింది. ఆ తర్వాత విడిపోయారు. జెన్నిఫర్ నుంచి విడిపోయిన అనంతరం బ్రాడ్ పిట్ హాలీవుడ్ సెక్సీ బ్యూటీ యాంజెలీనా జోలిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో కూడా ఎక్కువ కాలం బ్రాడ్ పిట్ జీవితాన్ని పంచుకోలేకపోయాడు. 2014లో వీరిద్దరి వివాహం జరగగా.. 2016లో విడిపోయారు. వీరిద్దరి డివోర్స్ హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

వీరిద్దరిని అధికారికంగా వివాహం చేసుకున్న బ్రాడ్ పిట్.. ఎందరో ముద్దుగుమ్మలతో ప్రేమాయణం సాగించాడు. ప్రస్తుతం 56 ఏళ్ల వయసులో కూడా బ్రాడ్ పిట్ కొందరు మోడల్స్ తో ఎఫైర్ సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇదిలా ఉండగా భర్త నుంచి విడిపోయినప్పటికీ.. బ్రాడ్ పిట్ కు సపోర్ట్ చేస్తూ జెన్నిఫర్ తరచుగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. తాజాగా వీరిద్దరూ 'స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్ 2020' వేడుకలో కలుసుకున్నారు. ,కలుసుకోవడం మాత్రమే కాదు.. స్టేజి వెనుక సెలెబ్రిటీలు అంతా వేచి ఉండే ప్రాంతంలో వీరి మధ్య చిన్నపాటి రొమాన్స్ కూడా జరిగింది. 

జెన్నిఫర్ తన మాజీ భర్తని హగ్ చేసుకుంటున్న, ముద్దు పెట్టుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ గా నిలిచాయి. హాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. జెన్నిఫర్ అవార్డు అందుకున్న తర్వాత స్టేజి వెనుక భాగంలో బ్రాడ్ పిట్ కోసం ఎదురుచూసిందట. అతడు రాగానే పలకరించింది. అలా ఈ మాజీ దంపతులు చాలా రోజుల తర్వాత సంతోషంగా గడిపారు. 

ఈ అవార్డ్స్ వేడుకలో బ్రాడ్ పిట్ 'ఒన్స్ అపాన్ ఎ టైం ఇన్ హాలీవుడ్' అనే చిత్రానికి గాను అవార్డు అందుకున్నాడు. ఇక జెన్నిఫర్ 'ది మార్నింగ్ షో' చిత్రానికి అవార్డు అందుకుంది. అవార్డులు అందుకున్నందుకు ఒకరినొకరు అభినందించుకున్నారు. 

బికినీలో మంట పెడుతున్న బ్యూటీ.. కంచె భామ అందాలు చూశారా!

బ్రాడ్ పిట్ తో తాను విడిపోవడానికి కారణం పరిస్థితులే అని.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇటీవల జెన్నిఫర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. బ్రాడ్ పై తనకు గౌరవం ఎప్పటికీ ఉంటుందని అంటోంది. బ్రాడ్ పిట్, ఏంజెలినాలు విడిపోయాక.. తన మాజీ భర్తకు దగ్గరయ్యేందుకు జెన్నిఫర్ ప్రయత్నిస్తున్నట్లు హాలీవుడ్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

RRR: అందరి పేర్లు చెప్పి అజయ్ దేవగన్ ని దాచేసిన రాజమౌళి