నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం రోజు వైజాగ్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహిస్తోంది.   

రూలర్ చిత్రానికి రచయిత పరుచూరి మురళి కథ అందించారు. మురళి ప్రీరిలీజ్ వేడుకలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 5 రోజుల్లో సినిమా సెట్స్ పైకి వెళ్ళిపోవాలి. మంచి కథ ఇవ్వు మురళి అని బాలయ్య అడిగారు. ఎలాంటి కథ రాయాలని ఆలోచిస్తుండగా బాలయ్యే స్వయంగా రైతుల కోసం మంచి కథ రాయమని అడిగినట్లు పరుచూరి మురళి తెలిపారు. 

ఇక హీరోలని పవర్ ఫుల్ హీరోయిజంతో చూపించే దర్శకులని చాలా మందిని చూశాం. కానీ ఒక హీరోని దేవుడిలా చూపించాలంటే కేఎస్ రవికుమార్ తర్వాతే ఎవరైనా. రజనీకాంత్ కు దేవుడు అనే ఇమేజ్ తీసుకువచ్చింది ఆయనే. ఈ కథ రాస్తున్నప్పుడు రవికుమార్ గారు ఎన్నో సలహాలు ఇచ్చారు. 

రూలర్ ప్రీరిలీజ్: దానవీరశూర కర్ణ.. బాలయ్య కోసం వెయిటింగ్!

రూలర్ ప్రీరిలీజ్: బాలయ్యని చూసి పిచ్చెక్కిపోతారు.. యాంకర్ ఝాన్సీ