నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం రోజు వైజాగ్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహిస్తోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో బలకృష్ణ తో హీరోయిన్లు వేదిక, సోనాల్ చౌహన్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 

ఈ చిత్రంలో కమెడియన్ సప్తగిరి కూడా నటించాడు. ప్రీరిలీజ్ వేడుకలో సప్తగిరి ప్రసంగిస్తూ.. దానవీరశూర కర్ణ చిత్రంలోని 'ఏమంటివి ఏమంటివి' డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్రంలో నేను హీరోగా నటించా. ఆ చిత్రం ప్రారంభించే ముందు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారికి నమస్కరించా. ఎందుకంటే ఆ చిత్రంలో ఏమంటివి ఏమంటి అనే డైలాగ్ వాడాం. 

ఆ డైలాగ్ ని వేదికపై మరోసారి సప్తరిగి వినిపించాడు. ఏమాత్రం తడబాటు లేకుండా అనర్గళంగా సప్తగిరి ఆ డైలాగ్ ని వినిపించాడు. ఈ డైలాగ్ ని బాలయ్యకు వినిపించాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా. ఈ రోజు ఆ అవకాశం లభించింది అని సప్తగిరి అన్నాడు. ఈ చిత్రంలో బాలయ్యతో కలసి నటించే అవకాశం దక్కడం తన అదృష్టం అని సప్తగిరి తెలిపాడు.  

రూలర్ ప్రీరిలీజ్: బాలయ్యని చూసి పిచ్చెక్కిపోతారు.. యాంకర్ ఝాన్సీ