2023 ఆస్కార్ కోసం పాకిస్తాన్ నుంచి జాయ్‌ల్యాండ్ సినిమా అఫీషియల్ ఎంట్రీ ఇచ్చింది. అయితే, అదే పాకిస్తాన్ తాజాగా, ఈ సినిమాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాలో ట్రాన్స్‌జెండర్ రోల్ కీలకంగా ఉన్నది. దీనిపై కొన్ని మత సమూహాల నుంచి వ్యతిరేకత రావడంతో పాకిస్తాన్ సెన్సార్ అధికారులు అనుమతులను వెనక్కి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ నుంచి ఆస్కార్ 2023 కోసం అఫీషియల్ మూవీ ఎంట్రీగా ఆ దేశం ‘జాయ్‌ల్యాండ్’ సినిమాను ఎంపిక చేసింది. ఈ సినిమాకు అంతర్జాతీయంగా విశేష స్పందన వచ్చింది. విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఆశ్చర్యకరంగా ఆదే దేశం ఈ మూవీ పై నిషేధం విధించింది. పాకిస్తాన్‌లోని థియేటర్‌లలో ఈ సినిమా విడుదల కాకుండా బ్యాన్ విధించింది. ఈ వారంలో జాయ్‌ల్యాండ్ సినిమా పాకిస్తాన్‌లో విడుదల కావాల్సి ఉన్నది. ఈ సినిమాలో ఓ మధ్యతరగతికి చెందిన వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమలో పడతాడు. ఈ కారణంగా ఆ దేశంలోని పలువురు మత పెద్దలు అభ్యంతరాలు లేవనెత్తారు. వారి ఆరోపణలతో అధికారులు ఈ సినిమాకు అనుమతులు వెనక్కి తీసుకున్నారు.
అంతర్జాతీయంగా ప్రసిద్ధ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కు చెందిన ఎల్జీబీటీక్యూ ప్రైజ్ ఈ సినిమాకు దక్కింది. దీనితోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలను ఈ మూవికి వచ్చాయి. టొరంటో ఫిలిమ్ ఫెస్టివల్, అమెరికన్ ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రీమియర్ వేశారు. ఈ సినిమాకు అనూహ్య సమీక్షలు వచ్చాయి.
Also Read: #Adipurush:'ఆదిపురుష్' అభిమానులకు అదిరిపోయే న్యూస్, పండగ చేసుకోవచ్చు
ఈ సినిమాకు పాకిస్తాన్ అధికారులు కూడా స్క్రీనింగ్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ, ఈ అనుమతి ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. ఈ సినిమా అభ్యంతరకరంగా ఉన్నదని కొందరు మత పెద్దలు, నేతలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే అధికారులు ఈ సినిమాపై నిషేధం విధించారు.
2018లో పాకిస్తాన్ పార్లమెంటు ట్రాన్స్‌జెండర్‌లపై సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్లను న్యాయపరంగా గుర్తిస్తూ ఓ చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం పాకిస్తాన్ పార్లమెంటును దద్దరిల్లించింది. కొందరు యథాతథవాదులు దీనిపై ఆగ్రహం వెళ్లగక్కారు. ఆ తర్వాత కూడా ఈ హక్కులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ క్యాంపెయిన్‌లు చేశారు.
ఆస్కార్ 2023 బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిమ్ కేటగిరీ లో పాకిస్తాన్ నుంచి జాయ్‌ల్యాండ్ సినిమా అధికారిక ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కు సయీం సాదిక్ దర్శకత్వం వహించారు.
స్టోరీ దేని గురించి అంటే?
ఈ సినిమా స్టోరీ వినూత్నంగా, విభిన్నంగా, సమాజంపై ఓ విమర్శగా ఉన్నది. మధ్య తరగతి కుటుంబం చెందిన ఓ యువ వివాహితుడు ఎరోటిక్ డ్యాన్స్ థియేటర్‌లో జాయిన్ అవుతాడు. అక్కడే ఓ ట్రాన్స్‌జెండర్ పర్ఫార్మర్‌తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఇరువురూ ఎదుర్కొన్న సవాళ్ల గురించి సినిమా ఉంటుంది.
Also Read: 'ఆదిపురుష్' వాయిదాకి రిపేర్లే కారణం కాదు..అసలైంది వేరే ఉంది?
ఈ సినిమా స్క్రీనింగ్‌కు అనుమతి ఇచ్చిన పాకిస్తాన్ సెన్సార్ బోర్డు ఆ తర్వాత ఈ సినిమాలో తీవ్ర అభ్యంతరకర విషయాలు ఉన్నాయని పర్మిషన్ ఉపసంహరించుకుంది. ఈ సినిమా హోమోసెక్సువాలిటీని ప్రమోట్ చేస్తున్నదని కొన్ని రిలీజియస్ గ్రూప్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది.
ఓ మతపరమైన పార్టీ సభ్యుడు, సెనేటర్ ముష్తాక్ అహ్మద్ ఖాన్ ఈ నిషేధం తర్వాత ఇలా ట్వీట్ చేశాడు. ఈ నిషేధం గురించి విని తాను స్తిమిత పడ్డాడని వివరించాడు. ఇక్కడ ఇస్లామికేతర విషయాలు ఏమీ జరగవు అంటూ పేర్కొన్నాడు. జాయ్‌ల్యాండ్ సినిమా విడుదలకు వ్యతిరేకంగా ఈయన క్యాంపెయిన్ చేపట్టాడు
