సినిమా ప్రారంభం నుంచి ఈ సినిమాకు ఏదో సమస్య వస్తూనే ఉంది. ఏదో ఒక అంశంతో నిత్యం వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్దితుల్లో ఫ్యాన్స్ కు ఓ హ్యాపీ న్యూస్.
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. అంత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. అయితే సినిమా ప్రారంభం నుంచి ఈ సినిమాకు ఏదో సమస్య వస్తూనే ఉంది. ఏదో ఒక అంశంతో నిత్యం వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. మొదట్లో అగ్ని ప్రమాదం జరిగింది. రావణుడుగా సైఫ్ చేయటం ఏంటి అని వివాదం వచ్చింది. అన్ని ఓకే అనుకుని సినిమా పూర్తి చేసి టీజర్ విడుదల చేస్తే...మళ్లీ అదే సమస్య. టీజర్ టీజర్ అస్సలు బాలేదంటూ కొందరు, కొందరి మనో భావాలు దెబ్బ తీసేలా సన్నివేశాలు ఉన్నాయంటూ మరికొందరు ఆరోపణలు చేస్తూ వచ్చారు. దాంతో రిలీజ్ వాయిదా వేసారు. ఇలాంటి పరిస్దితుల్లో ఫ్యాన్స్ కు ఓ హ్యాపీ న్యూస్.
అదేమిటంటే.. ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ సరిగమ సినిమాస్ వారు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతాయి. సరిగమ సినిమాస్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తే కొన్ని లాభాలు ఉంటాయి. రిలీజ్ బాగుంటుంది. దాంతో జూన్ నెలలో ఎన్ని హాలీవుడ్ సినిమాలు ఉన్నా తమకున్న పలుకుబడితో ఆదిపురుష్ సినిమాకు మంచి థియేటర్స్ USA లో పట్టుకోగలుగుతారు. కాబట్టి అక్కడ సాలిడ్ రిలీజ్ ఉంటుంది. రిలీజ్ బాగుంటేనే కలెక్షన్స్ బాగుంటాయి. ఈ సినిమాకు వచ్చిన అతి పెద్ద పాజిటివ్ న్యూస్ ఇదే అంటూ కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆదిపురుష్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదే ఈ సినిమా రన్ టైమ్. నిజానికి రామాయణ ఇతిహాసం లాంటి కావ్యాన్ని సినిమా రూపంలో చూపించడం అంత సులభమైన విషయం కాదు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా రన్ టైమ్ భారీగా ఉండనుందని వార్తలు వస్తున్నాయి సమాచారం మేరకు ఆదిపురుష్ రన్ టైం దాదాపు 3 గంటల 16 నిమిషాలు ఉంటుందని సమాచారం. అయితే అంత సమయం ఉంటే ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారు కాబట్టి ట్రిమ్ చేసిన వెర్షన్ తో టైట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా మన ముందుకు వచ్చే ప్రయత్నం జరుగుతోందిట. ఈ చిత్రంలో సీతా పాత్రలో కృతి సనన్ నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా కనిపించనున్నాడు.
