స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత చిత్ర రంగంలో ఆయన వారసత్వాన్ని బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. కానీ బాలయ్య, జూ.ఎన్టీఆర్ స్థాయిలో స్టార్ డమ్ అందుకోవడం మరొకరికి సాధ్యం కాలేదు. 

ప్రస్తుతం వీరిద్దరూ సినిమాలు చేస్తూ నందమూరి అభిమానులకు వినోదాన్ని అందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతలా అభిమానుల్ని ఆకర్షిస్తున్న నందమూరి వారసుడు మోక్షజ్ఞ. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. 

ఇదిగో అదిగో అంటున్నారు కానీ మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి ఇంతవరకు స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇది పక్కన పడితే.. అసలు మోక్షజ్ఞ నటుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు పూర్తిగా సన్నద్దమయ్యాడా అనే ప్రశ్న ఎదురవుతోంది. తరచుగా లీక్ అవుతున్న మోక్షజ్ఞ ఫోటోలు ఫాన్స్ ని కలవరపెడుతున్నాయి.

జూ.ఎన్టీఆర్ కి ఆ ఎనర్జీ ఉంది.. అతడే నా ఫేవరెట్.. రక్షిత్ శెట్టి కామెంట్స్! 

తాజాగా బాలయ్య ఫ్యామిలీ ఫోటో ఒకటి లీకైంది. ఈ ఫొటోలో మోక్షజ్ఞ కూడా కనిపిస్తున్నాడు. నందమూరి అభిమానుల కలవరపాటుకు కారణం మోక్షజ్ఞ లుక్. మోక్షజ్ఞ ఈ ఫొటోలో బొద్దుగా కనిపిస్తున్నాడు. గతంలో లీకైన కొన్ని ఫొటోల్లో కూడా మోక్షజ్ఞ ఇలాగే కనిపించాడు. 

అయ్యో పాపం మంచోడు.. నందమూరి హీరోకి దెబ్బేసిన మహేష్, బన్నీ!

ఆ మధ్యన బాలయ్య తన తనయుడితో ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోక్షజ్ఞ దృష్టి హీరోగా నటించడంపై లేదని.. అతడి దృష్టిని సినిమాపై మరల్చడానికే ఆ పూజలు నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. సెలబ్రిటీలు బరువు తగ్గడం పెద్ద విశ్యామ్ కాకపోయినా మోక్షజ్ఞ ఇలా తరచుగా కనిపిస్తుండడం అభిమానుల టెన్షన్ కు కారణం అవుతోంది. ఈ ఫొటోలో మోక్షజ్ఞతో పాటు బాలకృష్ణ దంపతులు, కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్ కనిపిస్తున్నారు.