బాహుబలి చిత్రం ఇచ్చిన ధైర్యంగా ప్రాంతీయ భాషా దర్శకులంతా పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. క్రమంగా ప్రాంతీయ భాషా చిత్రాల మార్కెట్ దేశం మొత్తం వ్యాప్తి చెందుతోంది. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన తాజా చిత్రం 'అవనే శ్రీమన్నారాయణ'. తెలుగులో 'అతడే శ్రీమన్నారాయణ'గా విడుదలవుతోంది. 

సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. గురువారం రోజు అతడే శ్రీమన్నారాయణ చిత్ర ట్రైలర్ ని అన్ని భాషల్లో విడుదల చేశారు. తెలుగు ట్రైలర్ ని నేచురల్ స్టార్ నాని తన సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయడం విశేషం. 

ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ నానికి కృతజ్ఞతలు తెలిపాడు. నాని చాలా సింపుల్ గా కనిపించే అద్భుతమైన వ్యక్తి అని ప్రశంసించాడు. ఇదే కార్యక్రమంలో రక్షిత్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

తెలుగులో నా అభిమాన నటుడు ఎన్టీఆర్ అని రక్షిత్ తెలిపాడు. అందుకు గల కారణాన్ని కూడా వివరించాడు. ఎన్టీఆర్ ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా ఒకేలా ఉంటారు. ఎలాంటి పాత్రలో అయినా ఎన్టీఆర్ నటించగలరు. ఆయనలో ఆ ఎనర్జీ ఉంది అని రక్షిత్ జూ.ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించాడు. 

డిసెంబర్ 27న అతడే శ్రీమన్నారాయణ మూవీ గ్రాండ్ గా రిలీజవుతోంది. సచిన్ ఈ చిత్రానికి దర్శత్వం వహించగా, శాన్వి హీరోయిన్ గా నటించింది.