టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఇలియానా బాలీవుడ్ వెళ్ళింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. బాలీవుడ్ ఆమెకు సరైన అవకాశాలు దక్కడం లేదు.. టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఇలియానాని మర్చిపోయారు. 

బాలీవుడ్ లో అరకొరగా దక్కుతున్న ఆఫర్స్ తోనే కెరీర్ నెట్టుకొస్తోంది. ఇలియానా చివరగా పాగల్ పంతి చిత్రంలో నటించింది. తాజాగా ఇలియానా మరో ఆఫర్ దక్కించుకున్నట్లు టాక్. గత ఏడాది సీనియర్ హీరో అజయ్ దేవగన్ నటించిన రైడ్ చిత్రం మంచి విజయం సాధించింది. 

ఇలియానా ఈ చిత్రంలో హీరోయిన్. రైడ్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించాలని అజయ్ దేవగన్ ఫిక్స్ అయ్యాడట. సీక్వెల్ లో కూడా ఇలియానానే హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నట్లు, ఇప్పటికే ఆమెని సంప్రదించినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

రైడ్ చిత్రం రాజ్ కుమార్ గుప్తా దర్శత్వంలో తెరకెక్కింది. మరి సీక్వెల్ కు ఆయనే దర్శకత్వం వహిస్తారా లేక వేరే ఎవరైనా డైరెక్టర్ వస్తారా అనే డి తెలియాల్సి ఉంది. రైడ్ చిత్రంలో ఇలియానా, అజయ్ దేవగన్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. 

చెత్త సినిమా అన్నారు.. అందుకే పేరు వేసుకోలేదు.. మారుతి

ఈ చిత్రం కనుక పట్టాలెక్కితే ఇలియానాకు మరో మంచి ఆఫర్ దక్కినట్లే. ఇలియానా చాలా కాలం తర్వాత టాలీవుడ్ లోకి అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. 

సమంతతో మొదలైన సునామి.. ఈ దశాబ్దంలో టాలీవుడ్ కి దొరికిన బెస్ట్ హీరోయిన్స్!

తెలుగులో ఇలియానా మహేష్, పవన్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి క్రేజీ హీరోలందరితో నటించింది. పోకిరి చిత్రం ఇలియానా కెరీర్ ని ఒక్కసారిగా మార్చేసింది.