ఎలాంటి కథకైనా హాస్యాన్ని జోడించి తెరకెక్కించడంలో మారుతి సిద్ద హస్తుడు. కెరీర్ ఆరంభం నుంచి మారుతి హాస్యం ప్రధానంగా సాగే చిత్రాలపైనే ద్రుష్టి పెడుతున్నాడు. తాజాగా మారుతి, సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన చిత్రం ప్రతి రోజు పండగే. ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.  

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రం మంచి వసూళ్లని సాధిస్తోంది. ఇటీవల సాయిధరమ్ తేజ్, దర్శకుడు మారుతి ఇద్దరూ కమెడియన్ అలీ హోస్ట్ గా వ్యవహరించే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మారుతి, తేజు అలీతో పలు విషయాలు పంచుకున్నారు. 

సమంతతో మొదలైన సునామి.. ఈ దశాబ్దంలో టాలీవుడ్ కి దొరికిన బెస్ట్ హీరోయిన్స్!

హీరో సుధీర్ బాబు నటించిన ప్రేమకథా చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. వాస్తవానికి ఆ చిత్రానికి దర్శకుడు మారుతి. కానీ టైటిల్ కార్డ్స్ లో మాత్రం సినిమాటోగ్రాఫర్ ప్రభాకర్ రెడ్డి పేరు వేశారు. అందుకు గల కారణాన్ని మారుతి ఆలీకి వివరించాడు. ప్రేమ కథా చిత్రం షూటింగ్ అయ్యాక నా స్నేహితులు, మరికొందరు ప్రముఖులు ఎడిటింగ్ వద్ద ఈ చిత్రాన్ని చూశారు. 

మాజీ ప్రియుడు గంగూలీపై నగ్మ హాట్ కామెంట్స్.. అతడు చేసింది తప్పు అంటూ..

ఒక్కరు కూడా సినిమా బావుందని అనలేదు. ఇదేం సినిమా.. చెత్తగా ఉంది. సప్తగిరి కామెడీ ఇరిటేటింగ్ గా ఉంది. నీకు డైరెక్టర్ గా మంచి పేరు ఉంది. ఈ సినిమాకు నీ పేరు వేసుకోకు అని చాలా మంది సలహా ఇచ్చారు. దీనితో సినిమా నిజంగా బాగలేదేమో అని భయపడ్డా. అందువల్లే దర్శకుడిగా నా పేరు వేసుకోలేదు అని మారుతి అన్నారు. కానీ ప్రతిరోజూ పండగే చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది.