కలైపులి థాను నిర్మాణంలో వెట్రిమారన్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా నటించిన చిత్రం ‘అసురన్‌’. ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఇందులో ధనుష్‌కు జోడీగా మలయాళ నటి మంజువారియర్‌ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ నేపధ్యంలో దాన్ని తెలుగు రైట్స్ తీసుకుని నారప్ప గా రీమేక్ చేస్తున్నారు సురేష్ బాబు. అదే సమయంలో ఈ చిత్రాన్ని ...ఎన్టీఆర్ సైతం చూడటం జరిగింది. ఆయనకు తెగ నచ్చిందిట. దాంతో ఆ దర్శకుడుతో తనో ప్రాజెక్టు చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు ఆ దర్శకుడుకి కబురు పంపి...తన బాడీ లాంగ్వేజ్ కు తగిన విధంగా కథ చేయమని, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయమని అన్నట్లు సమాచారం.

దాంతో ఓ స్టోరీ లైన్ ని ఇప్పటికే వెట్రిమారన్ చెప్పారట. ఆ లైన్ చాలా నోవల్టీగా ఉందని, బాగా రా గా అనిపించిందని, మరో అసురన్ అయ్యే అవకాసం ఉందని ఎన్టీఆర్ ఫీలయ్యారట. ఓ కొత్త తరహా సినిమా వస్తుందని భావించి, పూర్తి స్క్రిప్టు డవలప్ చేసి చెప్పమని వెట్రిమారన్ కు చెప్పారట. ఈ లోగా తను రాజమౌళితో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం పూర్తి చేసుకుని వస్తానని, ఆ తర్వాత ఇద్దరం కూర్చుని స్క్రిప్టు ఫైనలైజ్ చేసి ప్రారంభిద్దామని చెప్పారట. అయితే తన గత చిత్రాలు ఓ సారి చూడమని, తన బాడీ లాంగ్వేజ్ ని అబ్జర్వ్ చేయమని ఆ దర్శకుడుకు చెప్పారట. ముఖ్యంగా అరవింద సమేత చిత్రం చూసి అభిప్రాయం చెప్పమని కోరారట.

40 ఏళ్ల వయసులో తల్లైన హీరోయిన్లు.. ఇంత ఆలస్యం కావడానికి కారణం ఇదే!

ఇక ‘ఎఫ్ ‌2, వెంకీమామ’ చిత్రాలతో సక్సెస్‌ల మీదున్న విక్టరీ వెంకటేష్ తన తదుపరి చిత్రంగా తమిళ ‘అసురన్’ను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోంది. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జనవరి 22 నుంచి మొదైంది. 3వారాల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌ను రాయలసీమలోని అనంతపూర్ పరిసర ప్రాంతాలలో ప్లాన్ చేసి తీస్తున్నారు. వెంక‌టేశ్ స‌ర‌స‌న ప్రియ‌మ‌ణి న‌టించ‌నున్న ఈ సినిమాకు తెలుగులో ‘నార‌ప్ప’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి అఫీషియల్  పోస్టర్స్‌ని విడుదల చేసింది. డి.సురేష్‌బాబు, క‌లైపులిథాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మరీ ఇంతలా చెడిందా.. పవన్ పై అలీ తీవ్ర వ్యాఖ్యలు ?